https://oktelugu.com/

Manchu Vishnu: మరోసారి ప్రెసిడెంట్ అవ్వాలంటే విష్ణు వీటికి సమాధానం చెప్పాల్సిందే…

గత సంవత్సరం అక్టోబర్ కే మా అధ్యక్షుడి పదవి కాలం పూర్తి అయింది. కానీ ఫైనాన్షియల్ లెక్కలు తేలే వరకు ఎలక్షన్స్ ని కొద్ది నెలలు వాయిదా వేశారు. ఇక ఏప్రిల్ లోనే ఈ ఎలక్షన్స్ ఉండాల్సింది.

Written By:
  • Gopi
  • , Updated On : April 9, 2024 / 12:06 PM IST

    Manchu Vishnu

    Follow us on

    Manchu Vishnu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మా ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతను నిర్వహిస్తున్న హీరో మంచు విష్ణు… గత రెండు సంవత్సరాల క్రితం మా ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా పోటీచేసి ప్రకాష్ రాజు పైన ఘనవిజయాన్ని సాధించిన విష్ణు..అప్పటినుంచి ఇప్పటివరకు మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక మా అధ్యక్షుడి పదవి కాలం ముగిసిన కూడా మరో టర్మ్ కి మంచు విష్ణు నే అధ్యక్షుడిగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈసారి ఎలక్షన్స్ ఏమి లేకుండా ఏకగ్రీవంగా విష్ణు ను నియమించబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇది ఇలా ఉంటే కిందటి సారి ఎలక్షన్స్ సమయం లో ఇరు వర్గాల మధ్య పోటీ అనేది చాలా రసవత్తరంగా నడిచింది. ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు వేశారు. ఇక మొత్తానికైతే విష్ణు అధ్యక్షుడు అయ్యాడు. అయితే విష్ణు ఆ ఎలక్షన్స్ కి ముందు మా బిల్డింగ్ కట్టిస్తానని వాగ్దానం చేశాడు. ఎవ్వరూ డబ్బులు ఇవ్వకపోయినా తన సొంత డబ్బులతో మా బిల్డింగ్ నిర్మిస్తానని చెప్పాడు. ఇక తను అధ్యక్షుడై రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదు. మధ్యలో ఒకసారి 3 స్థలాలు చూశాను ఎక్కువమంది ఏ ప్లేస్ ని అయితే ఒకే చెబుతారో అక్కడే బిల్డింగ్ మా బిల్డింగ్ కట్టిస్తాను అని చెప్పినప్పటికీ, ఆ మూడు ప్లేసులు ఎక్కడున్నాయో కూడా ఎవరికీ తెలియదు..

    ఇక ఈ రెండేళ్లలో ఆయన ఆర్టిస్టులకు చేసింది కూడా ఏమీ లేదు.? ఇక ఇప్పుడు ఫండ్స్ ని కలెక్ట్ చేయడానికి కొంతమంది సెలబ్రిటీలతో ఒక ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నాడు. అలాగే మా బిల్డింగ్ ని కూడా కట్టించబోతున్నట్టుగా కూడా చెబుతున్నాడు. కానీ అది ఎప్పుడూ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు ఇక ఈ రెండు సంవత్సరాల సమయంలో అసలు మా బిల్డింగ్ గురించి ఆలోచించకుండా పదవి కాలం ముగిసే సమయానికి ఇప్పుడు కట్టిస్తాను అని ప్రగల్ బాలు పలకడం ఎందుకు అంటూ చాలామంది విష్ణుపైన విమర్శలు చేస్తున్నారు.

    గత సంవత్సరం అక్టోబర్ కే మా అధ్యక్షుడి పదవి కాలం పూర్తి అయింది. కానీ ఫైనాన్షియల్ లెక్కలు తేలే వరకు ఎలక్షన్స్ ని కొద్ది నెలలు వాయిదా వేశారు. ఇక ఏప్రిల్ లోనే ఈ ఎలక్షన్స్ ఉండాల్సింది. కానీ ఇప్పుడు కూడా జరిగే విధంగా కనిపించడం లేదు.ఇక విష్ణు నే మరోసారి మా అధ్యక్షుడిగా తన బాధ్యతల్ని కొనసాగించాలంటే ఇంతకు ముందు ఆయన చేసిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుస్తాడో చెప్పాలని మా సభ్యులు అడుగుతున్నారు…