https://oktelugu.com/

Rashmika Mandanna: అద్దె కట్టలేక రోడ్డున పడ్డ కుటుంబం… రష్మిక మందాన ఒకప్పటి పరిస్థితి ఇంత దారుణమా!

చదువుకునే రోజుల్లో తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక కష్టాలు అనుభవించారట. కనీసం ఇంటి రెంట్ కట్టలేక రోడ్డున పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో రష్మిక వెల్లడించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 9, 2024 / 11:34 AM IST

    Rashmika Mandanna

    Follow us on

    Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి సాలిడ్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ హోదా పట్టేసింది. పుష్ప, యానిమల్ చిత్రాలతో రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. కోట్లు సంపాదిస్తూ ఆస్తులు కూడబెడుతున్న రష్మిక ఒకప్పుడు కనీసం ఇంటి అద్దె కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారట.

    చదువుకునే రోజుల్లో తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆర్థిక కష్టాలు అనుభవించారట. కనీసం ఇంటి రెంట్ కట్టలేక రోడ్డున పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో రష్మిక వెల్లడించింది. రష్మిక మందాన మాట్లాడుతూ .. నా జీవితంలో మరో కోణం ఉంది. మా కుటుంబం ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారుతూ ఉండేది. చిన్నపుడు ఉండటానికి ఇల్లు కూడా లేక ఇబ్బందులు పడ్డాము. అద్దె ఇంటికి రెంట్ కట్టలేని పరిస్థితి.

    అందుకే తరచూ ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం. అద్దె ఇంటి కోసం వీధుల్లో తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒక బొమ్మ కొనివ్వమని కూడా మా పేరెంట్స్ ని అడిగే వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్లకు ఆ స్థోమత లేదు. ఇప్పటికీ చిన్నప్పుడు పడ్డ కష్టాలు గుర్తున్నాయి. అందుకే నేను సక్సెస్ ని అంత తేలికగా తీసుకోను. డబ్బులకు చాలా విలువ ఇస్తాను అని రష్మిక మందాన చెప్పుకొచ్చింది.

    రష్మిక మొదటి సినిమా కిరిక్ పార్టీ. కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఆమెకు అవకాశం ఇచ్చాడు. తొలి సినిమా కి రష్మిక తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 1. 50 లక్షలు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లకు పైగా తీసుకుంటుందట. లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ సినిమాకు రూ. 7 కోట్లు తీసుకుందని టాక్. సినిమాలే కాకుండా పలు బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. రష్మికకు పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నాయి.