Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యూత్ క్రష్ బ్యూటీ రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం “పుష్ప”. ఈ ఏడాది డిసెంబర్ 17న “పుష్ప ది రైజ్” పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు ఎంత సక్సెస్ అందుకు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు పాటల రచయిత చంద్రబోస్…
“పుష్ప” పాటలు విడుదలయ్యాక చాలామంది అభినందిస్తూ మెసేజ్‌లు పంపించారు. అలానే అమెరికా నుంచి కుడా పాలువురు ఫోన్ చేసి “పుష్ప” పాటల అద్భుతంగా ఉన్నాయన్నారు. సుకుమార్ గారితో నాకు “ఆర్య” సినిమా నుండి మంచి అనుబంధం ఉంది. ఆయన స్వతహాగా కవి కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడం మరింత సవాల్ అనిపించింది. పుష్ప సినిమాకు పాటలు రాయటం కాస్త కష్టం అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా యాసలో ఉంటుంది. కాబట్టి పాటల్లో కూడా ఆ ప్రాంత యాసతో పదాలను ఉపయోగించాలి. అయితే సుకుమార్, అల్లు అర్జున్ గార్లు ఆ యాసను ఒంట బట్టించు కుని అందులో లీనం అయిపోయి నటించే విధానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌కే చాలెంజ్.
దాక్కో దాక్కో మేక, శ్రీవల్లీ, సామీ సామీ,ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా.. పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా..’ అనే ఈ ఐటెమ్ సాంగ్ ప్రేక్షకుల బాగా నచ్చుతుంది. చూపే బంగారమాయెనే పాట ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఓ బ్రిడ్జి ఎక్కుతున్నప్పుడు వచ్చిన ఆలోచనే. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండింగ్‌లో ఉండటం సంతోషంగా ఉంది అని అన్నారు పాటల రచయిత చంద్రబోస్.