https://oktelugu.com/

Bigg Boss Lobo: మెగాస్టార్ సినిమా లో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్… లోబో

Bigg Boss Lobo: బుల్లితెరపై యాంకర్ గా మొదలైన లోబో ప్రయాణం… కమెడియన్ గా తెలుగు రియాలిటీ షో అయినా బిగ్ బాస్ 5 వరకు కొనసాగింది. బిగ్ బాస్ సీజన్ 5 లో మంచి ఎంట‌ర్ టైన్ మెంట్ గా ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే లోబో ఇటీవ‌ల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమి నేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి ఎలిమి నేట్ అయిన త‌ర్వాత కూడా ప‌లు కామిడీ షో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 08:34 PM IST
    Follow us on

    Bigg Boss Lobo: బుల్లితెరపై యాంకర్ గా మొదలైన లోబో ప్రయాణం… కమెడియన్ గా తెలుగు రియాలిటీ షో అయినా బిగ్ బాస్ 5 వరకు కొనసాగింది. బిగ్ బాస్ సీజన్ 5 లో మంచి ఎంట‌ర్ టైన్ మెంట్ గా ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే లోబో ఇటీవ‌ల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమి నేట్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ నుంచి ఎలిమి నేట్ అయిన త‌ర్వాత కూడా ప‌లు కామిడీ షో ల లో అలరించారు. ఈ మ‌ధ్య కాలంలో లోబోకు సంబంధించి ఒక వార్త తెగ వైర‌ల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి రాబోయే సినిమాలో క‌మెడియ‌న్ లోబోకు అవ‌కాశం వ‌చ్చింద‌ని సోష‌ల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఆ వార్త పై పూర్తి క్లారిటీ లేదు.  తాజాగా ఆ వార్తపై క‌మెడియ‌న్ లోబో స్పందించారు.

    లోబో త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో చిరంజీవితో ఉన్న ఫోటో ను పోస్ట్ చేసి… “చాలా రోజుల త‌ర్వాత తర కల నెర‌వేరింద‌ని” రాసుకు వ‌చ్చాడు. మెగాస్టార్ చిరంజీవి త‌న‌ను పిలిచి మరీ త‌న సినిమాలో అవ‌కాశం ఇచ్చాడ‌ని లోబో తెలిపాడు. ఇటీవ‌ల పాల్గొన్న ఒక టీవీ షోలో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవ‌కాశం వ‌చ్చింద‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటూ  ఆ విషయాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పక్క‌న న‌టించ‌డం అంటే త‌న క‌ల ఫలించిందని అన్నారు. చిరంజీవి మెహ‌ర్ ర‌మేశ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న” భోళా శంక‌ర్” సినిమాలో లోబో న‌టిస్తున్న‌ట్టు సమాచారం.