Raghav Juyal Paradise movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాని(Nani) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరిలో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. అయితే నాని టైర్ వన్ హీరోగా మారనప్పటికి తను చేయబోతున్న సినిమాలతో టైర్ వన్ హీరో రేంజ్ ను టచ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన మాస్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. దసర (Dasara) సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన శ్రీకాంత్ ఓదెల (Sriaknth Odela) దర్శకత్వంలో ప్యారడైజ్ (Paradaise) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆయన చేస్తున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కిల్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న రాఘవ జ్యూయల్ ను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా రాఘవ్ బర్త్ డే సందర్భంగా ఒక మేకింగ్ వీడియో ని కూడా రిలీజ్ చేశారు. అందులో కత్తులు, గొడ్డళ్లు వాడుతూ అతని క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నట్టుగా చూపించారు.
మరి ఏది ఏమైనా కూడా రాఘవ్ ఈ సినిమాలో పోషించే పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందట. ఈ సినిమాను కనక తను అనుకున్న రేంజ్ లో తీయగలిగితే శ్రీకాంత్ ఓదెల స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోతాడు అనేది వాస్తవం మరి ఇలాంటి సందర్భంలో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న ఈ సినిమాతో నాని ని టైర్ వన్ హీరోగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో రాఘవ్ కి నానికి మధ్య ఒక భీకరమైన ఫైట్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దసర కు మించి ఇందులో వైలెన్స్ అయితే ఉంటుందట. శ్రీకాంత్ ఓదెల ఇంతకుముందు చేసిన దసర సినిమా కూడా మాస్ సినిమానే కావడం వల్ల ఈ సినిమాతో కూడా మరోసారి తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…