Balayya disaster movies:తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వరకు ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలయ్య బాబు లాంటి నటుడు సైతం ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య ఆ తర్వాత చేసిన సినిమాలతో వరస సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ఫోర్ హీరోల్లో తను కూడా ఒకరిగా ఎదగడం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాలు అతనికి ఎలాంటి గుర్తింపును తీసుకొచ్చి పెట్టబోతున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది. అయితే బాలయ్య బాబు (Balayya Babu) తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అయితే రెండు సినిమాలు మాత్రం ఆయన సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తాయని అనుకున్నప్పటికి అవి డిజాస్టర్లుగా మారాయట. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి అంటే అందులో ఒకటి ‘సీమ సింహం’ (Seema simham) సినిమా…
Also Read: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’… అసలు ఏమవుతుంది? సైలెన్స్ కి కారణం?
నరసింహనాయుడు (Narasimha Naidu) సినిమా తర్వాత భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు… ఇక ఆ తర్వాత వైవిఎస్ చౌదరి (YVS Chowdary) దర్శకత్వంలో వచ్చిన ఒక మగాడు (Okka Magadu) సినిమా మీద కూడా ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా భారతీయుడు సినిమాని పోలి ఉందని చాలామంది ఆ సినిమాని రిజెక్ట్ చేశారు.
మరి ఏది ఏమైనా కూడా అప్పటి నుంచి బాలయ్య బాబు తన చేసే సినిమాల మీద పెద్దగా హోప్స్ అయితే పెట్టుకోవడం లేదట.ఏ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అనేది మనం ఎస్టిమేట్ చేయలేము…కొన్ని సార్లు ఆ మూవీ రిలీజ్ టైమును బట్టి వాళ్ళ మూడు మారిపోతూ ఉంటుంది అంటూ ఆయన పలు సందర్భాల్లో తెలియజేశాడు.
Also Read: కోట శ్రీనివాస రావు అందరికి నచ్చే వ్యక్తి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్
మరి మొత్తానికైతే బాలయ్య బాబు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు… ఇక ఇప్పటికే నాలుగు విజయాలను అందుకున్న ఆయన ఇప్పుడు చేస్తున్న అఖండ 2 (Akhanda 2) సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…