Bigg Boss 6 Telugu Sudeepa Elimination: ఆసక్తికరమైన టాస్కులతో ఎంటర్టైన్మెంట్ కి పెద్ద పీట వేస్తూ ముందుకు దూసుకుపోతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 6..రోజు సరికొత్త టాస్కులతో ఆసక్తి లేపుతున్న ఈ రియాలిటీ షో కి TRP రేటింగ్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి..నిన్న గాక మొన్న ప్రారంభమైనట్టు ఉన్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే ఆరు వారాలను పూర్తి చేసుకుంది..ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవ్వరు ఊహించని విధంగా సుదీప ఎలిమినేట్ అయిపోయింది.. ఓటింగ్ ప్రకారం చివరి రెండు స్థానాల్లో కొనసాగిన ఇంటి సభ్యులు బాలాదిత్య మరియు సుదీప..ఇద్దరి మధ్య ఓటింగ్ శాతం తేడా కేవలం ఒక్క శాతం మాత్రమే..ఓట్లు కూడా వందల్లోనే తేడా వచ్చినట్లు సమాచారం.

అందరితో బాగా మాట్లాడుతూ ఇంటి పనులు.. వంట పనులు చేసే సుదీప ఎందుకు ఎలిమినేట్ అయ్యింది అంటూ ఆమెని అభిమానించే వారు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..కానీ ఆమె ఇంట్లో పనులైతే బాగానే చేస్తుంది టాస్కుల్లో మాత్రం పెద్ద తన ప్రభావం చూపించలేకపోయింది అనే చెప్పాలి..అందుకే ఆమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు.
హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు చాలా మంది వచ్చిన కొత్తల్లో టాస్కులు ఆడడంలో కాస్త తడబడేవారు..చాలా మంది ఇంటి సభ్యులైతే టాస్కులను చాలా తేలికగా తీసుకునేవారు..అయితే రెండవ వారం లో అక్కినేని నాగార్జున ఇంటి సభ్యులందరినీ గట్టిగా మందలించడం తో చాలా మంది తమ ఆట తీరుని బాగా మెరుగుపర్చుకొని ముందుకు దూసుకుపోతున్నారు..కానీ సుదీప మాత్రం తన ఆట తీరులో ఎలాంటి ప్రధానమైన మార్పులను చూపించలేకపోయింది..అంతే కాకుండా మిగిలిన ఇంటి సభ్యులతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ విషయం లో కూడా సుదీప చాలా వీక్ అనే చెప్పాలి..నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలలో సుదీప కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది..ఆ రేంజ్ లో ఇక్కడ కూడా అలరిస్తుంది అని అందరూ అనుకున్నారు..కానీ ఆమె కనీసం కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

అయితే హౌస్ లో వంట మొత్తం ఆమెనే చేసేది..ఇప్పుడు ఆమె వెళ్లిపోవడం ఇంటి సబ్యులకు పెద్ద లోటు అనే చెప్పాలి..ప్రేక్షకులు టాస్కులు ఆడే కంటెస్టెంట్స్ తో పాటుగా ఎంటర్టైన్మెంట్ పంచె కంటెస్టెంట్స్ ఎవరో కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు..హౌస్ లో గీతూ వంటి వారు ఎన్ని వేషాలు వేసిన ఇంకా ఇంట్లో ఎందుకు ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు కాబట్టే..అందుకే ఎంటర్టైన్మెంట్ ప్రధానంగానే ఈ బిగ్ బాస్ సీజన్ ముందుకు పోతుంది.