Kamal Haasan: కమలహాసన్ కి కల్కి సినిమా వల్ల డ్యామేజ్ జరిగే అవకాశం ఉందా..?

కమలహాసన్ తనను తాను మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది...ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు కల్కి సినిమా చేయడం వల్ల ఆయన చేస్తున్న సినిమాల పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 17, 2024 9:18 am

Kamal Haasan

Follow us on

Kamal Haasan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన సినిమాలు చేయడంలో కమలహాసన్ ముందు వరుసలో ఉంటాడు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్ని కూడా ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరు చేయలేని సినిమాలనే చెప్పాలి. తను చేయాల్సిన పాత్ర ఎలాంటి దైన దానికోసం తనను తాను మార్చుకొని ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయడంలో ఆయన 100% సక్సెస్ అయ్యారు.

ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో విచిత్ర సోదరులు, సాగర సంగమం, శుభసంకల్పం, స్వాతి ముత్యం, దశావతారం లాంటి సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే కల్కి లాంటి సినిమాలో విలన్ పాత్రను పోషించాడు. ఆయన పోషించిన పాత్ర సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతుందంటూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో తెలియజేశాడు. ప్రభాస్ తో పాటు పోటీ పడే క్యారెక్టర్ కాబట్టి ఈ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ పాత్రలో కమలహాసన్ తనను తాను మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు కల్కి సినిమా చేయడం వల్ల ఆయన చేస్తున్న సినిమాల పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటూ కొంతమంది వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో తను విలన్ గా నటిస్తున్నాడు. కాబట్టి తర్వాత వచ్చే సినిమాల మీద ఆ ఇంపాక్ట్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఇక వచ్చే నెల 12వ తేదీన కమలహాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 మూవీ రిలీజ్ అవుతుంది.

మరి ఈ సినిమా మీద కల్కి మూవీ లో ఆయన పోషించిన పాత్ర ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి కల్కి సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయితే కమల్ హాసన్ కి ఎలా క్రెడిట్ వస్తుంది. తన భారతీయుడు 2 సినిమాకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది…