https://oktelugu.com/

Double iSmart: రామ్ ఆగస్టు 15 కి రావడానికి అసలు కారణం ఇదేనా..?

కాబట్టి రామ్ కి తన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి స్లాట్ అయితే దొరికే అవకాశం లేదు. కాబట్టి ఆగస్టు 15 అయితే ఒక అకేషన్ రోజు సినిమాని రిలీజ్ చేసినట్టుగా ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 09:29 AM IST

    Double iSmart

    Follow us on

    Double iSmart: ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామంటూ వాళ్లు ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే దీంతో పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ను ఆగస్టు 15 న రిలీజ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇక ఆ తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు వాళ్ల సినిమాలను రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.

    కాబట్టి రామ్ కి తన సినిమాని రిలీజ్ చేసుకోవడానికి ఇంతకు మించి మంచి స్లాట్ అయితే దొరికే అవకాశం లేదు. కాబట్టి ఆగస్టు 15 అయితే ఒక అకేషన్ రోజు సినిమాని రిలీజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు, పెద్దలు అందరిని ఆకర్షించినట్టుగా అవుతుందనే ఉద్దేశ్యంతోనే తను ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో రామ్ మరోసారి తను భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
    ఇక వీళ్ళ కాంబోలో ఇంతకు ముందే ఇస్మార్ట్ శంకర్ సినిమా రావడంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ పైన విపరీతమైన అంచనాలైతే పెరిగాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాస్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకుంటాడు.

    లేకపోతే మాత్రం రామ్ కి ఈ సినిమాతో భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇంతకు ముందు బోయపాటి తో చేసిన స్కంద సినిమా భారీ అంచనాలతో వచ్చి ప్లాప్ అయింది. ఇక ఈ సినిమా పైన రామ్ పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు…