Kalki 2898 AD: కల్కి నుంచి భైరవ ఆంథమ్ సాంగ్ ఆడియో వచ్చేసింది..మరి వీడియో పరిస్థితి ఏంటి..?

మరి కొద్ది గంటల్లో ఆ సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియో కూడా రాబోతుంది. ఇక సింగర్ 'దిల్జిత్ దోసాంజ్' ఈ పాటను అద్భుతంగా పాడాడమే కాకుండా ఈ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు. అయితే ఈ పాట కి సంబంధించిన వీడియోలో సింగర్ కూడా కనిపించబోతున్నాడు.

Written By: Gopi, Updated On : June 17, 2024 9:12 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మీద ప్రమోషన్లు భారీగానే చేస్తున్నప్పటికీ అవి ఏవి కూడా అంత బాగా వర్కౌట్ కావట్లేదు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో అయితే వచ్చింది.

ఇక దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నామని సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలోకి అయితే వచ్చేసింది. మరి కొద్ది గంటల్లో ఆ సాంగ్ కు సంబంధించిన ఫుల్ వీడియో కూడా రాబోతుంది. ఇక సింగర్ ‘దిల్జిత్ దోసాంజ్’ ఈ పాటను అద్భుతంగా పాడాడమే కాకుండా ఈ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నారు. అయితే ఈ పాట కి సంబంధించిన వీడియోలో సింగర్ కూడా కనిపించబోతున్నాడు.

ఇక మొత్తానికైతే మరికొద్ది గంటల్లో ఈ సాంగ్ సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేస్తున్నా నేపథ్యం లో ప్రభాస్ అభిమానులు కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ ఫుల్ వీడియో సినిమాకి ప్రమోషనల్ వీడియో గా పని చేయనుంది. ఇక ఈ సినిమా ఈనెల 27వ తేదీన భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి సినిమాతో మరొక భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే నాగ్ అశ్విన్ తను అనుకున్నట్టుగానే ఈ సినిమాని భారీ సక్సెస్ చేసెట్టుగానే కనిపిస్తున్నాడు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా తను చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.. చూడాలి మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది…