Koratala Siva: మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ పాన్ ఇండియాలో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా తనదైన రీతిలో ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో కొరటాల శివ కూడా తనదైన రీతిలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే స్టార్ డైరెక్టర్లందరూ స్టార్ హీరోలతో సినిమాలను చేస్తునే వాళ్ల తర్వాత సినిమాలను కూడా అనౌన్స్ చేశారు.
కానీ ఒక్క కొరటాల శివ మాత్రం దేవర సినిమా మీదనే చాలా రోజుల నుంచి వర్క్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్ ఏంటి అనే దాని మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇలాంటి క్రమంలో కొరటాల శివ తమిళ్ హీరోల పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఒక ప్రయోగాత్మకమైన సినిమాని చేయబోతున్నాడట.
ఇక అందులో భాగంగానే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో హీరోలైన సూర్య గాని లేదంటే విక్రమ్ గాని ఈ సినిమాలో హీరోలుగా నటించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలియజేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒక ఎక్స్పరిమెంటల్ సైన్స్ ఫిక్షన్ జానర్లో కొనసాగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాంటి సబ్జెక్టులకు వాళ్ళు అయితేనే న్యాయం చేయగలరనే ఉద్దేశ్యంతో ఆయన తమిళ్ హీరోలని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More