https://oktelugu.com/

Inaya Sultana: బిగ్ బాస్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా! ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా?

ఫోటోలో ఉన్న అందాల భామ మరెవరో కాదు బాగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇనాయ సుల్తానా పెద్దగా రాణించలేదు. పలు చిన్న సినిమాల్లో ఆమె నటించినప్పటికీ అనుకున్నంత గుర్తింపు లభించలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 9, 2024 / 12:20 PM IST

    Inaya Sultana

    Follow us on

    Inaya Sultana: పైన ఫోటోలో గాల్లో ఫీట్లు చేస్తున్న బ్యూటీ ని గుర్తుపట్టారా. ఈ ముద్దుగుమ్మ చాలా ఫేమస్. ముఖ్యంగా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఈమె బాగా తెలుసు. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. కానీ ఈ హాట్ బ్యూటీ కి బిగ్ బాస్ షో అంత్యంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. నిత్యం తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ కట్టిపడేస్తుంది. కొంతకాలంగా గ్లామర్ డోస్ పెంచేసి నాన్ స్టాప్ ఫోటో షూట్లతో మెస్మరైజ్ చేస్తుంది.

    ఫోటోలో ఉన్న అందాల భామ మరెవరో కాదు బాగ్ బాస్ ఫేమ్ ఇనాయ సుల్తానా. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇనాయ సుల్తానా పెద్దగా రాణించలేదు. పలు చిన్న సినిమాల్లో ఆమె నటించినప్పటికీ అనుకున్నంత గుర్తింపు లభించలేదు. దర్శకుడు రాంగోపాల్ వర్మ షేర్ చేసిన ఒక్క వీడియోతో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ క్రేజ్ తో బిగ్ బిగ్ హౌస్ లో అడుగుపెట్టింది. తన అందంతో ఇనాయ బాగానే ఆకట్టుకుంది. హౌస్ లో సత్తా చాటింది.

    అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక గ్లామర్ మరింత పెంచింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులను పెంచుకుంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఆమె ఫోటోలు చూసిన అభిమానులు ఇనాయ కు సినిమాల్లో అవకాశాలు ఇవ్వొచ్చుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె గ్లామర్ వేరే లెవెల్ అంటున్నారు.

    రీసెంట్ గా మినీ డ్రెస్ లో కిరాక్ పుట్టించిన ఇనాయ .. మరో ఫోటో షూట్ లో చీర కట్టుకుని కుర్రకారుకి చెమటలు పట్టించింది. తాజాగా గాల్లో గ్లామర్ ఫీట్లు చేస్తూ రచ్చ రేపుతోంది. గాల్లోకి ఎగిరి ఫోటో షూట్ చేసింది. ఇనాయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే చివరిగా క్రాంతి అనే సినిమాతో ఇనాయ నటించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఫ్రైడే టైటిల్ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ మూవీలో ఇనాయ గర్భవతిగా కనిపించనుంది.