JEE Advanced Results 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. పెరిగిన కటాఫ్!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఐటీ డిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 360 మార్కులకు 355 సాధించిన సీఆర్‌ఎల్‌లో(కమాన్‌ ర్యాంక్‌ లిస్ట్‌) టాపర్‌గా నిలిచాడు.

Written By: Raj Shekar, Updated On : June 9, 2024 12:16 pm

JEE Advanced Results 2024

Follow us on

JEE Advanced Results 2024: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్‌ ఫలితాలను విడుదల చేసింది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల కనీస కటాఫ్‌ 93.2 పర్సంటైల్‌గా ఉంది. 2023లో ఈ పర్సంటైల్‌ 90.7 ఉండగా, 2022లో 88.4గా ఉంది. గత రెండేళ్లతో పోలిస్తే జనరల్‌ కేటగిరీ పర్సంౖటెల్‌ పెరిగింది.

టాపర్లు వీరే..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో ఐటీ డిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లహోటి 360 మార్కులకు 355 సాధించిన సీఆర్‌ఎల్‌లో(కమాన్‌ ర్యాంక్‌ లిస్ట్‌) టాపర్‌గా నిలిచాడు. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్‌కుమార్‌ పటేల్‌ 332 మార్కులు సాధించి సీఆర్‌ఎల్‌–7తో టాప్‌ మహిళా ర్యాంకర„Š గా నిలిచింది. ఈ మేరకు కామన్‌ ర్యాంక్‌ లిస్ట్, కేటగిరీల ర్యాంకుల జాబితాలే ఐఐటీ మద్రాస్‌ విడదల చేసింది.

మే 26 పరీక్ష..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మే 26న దేశవ్యాప్తంగా నిర్వహించింది. రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహించారు. ఆన్సర్‌ కీని జూన్‌ 2న విడుదల చేశారు. 2.4 లక్షల మంది పరీక్షకు అర్హత సాధించారు. తాజా ఫలితాల్లో ఈ ఏడాది కటాఫ్‌ మార్కులు బాగా పెరిగాయి. అభ్యర్థులు పర్సంటైల్‌ వివరాల కోసం ్జ్ఛ్ఛ్చఛీఠి.్చఛి.జీn వెబ్‌సైట్‌ను సందర్శించి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. పేపర్‌1, పేజర్‌ 2 రెండింటి స్కోర్‌కార్డులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

వివిధ కేటగిరీల వారీగా టాపర్లు వీరే..
ఓపెన్‌ కేటరిరీలో ఐఐటీ ఢిల్లీ పరిధిలోని వేద్‌ లహోటీ టాపర్‌గా నిలవగా, జనరల్‌ (ఈడబ్ల్యూఎస్‌) కేటరిరీలో ఐఐటీ ఢిల్లీ పరిధిలోని రాఘవశర్మ ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. ఓబీసీ కేటగిరీలో ఐఐటీ భువనేశ్వర్‌ పరిధిలోని మచ్చ బాలాదిత్య మొదటి స్థానం సాధించాడు. ఎస్సీ కేటరిరీలో ఐఐటీ భువనేశ్వర్‌ పరిధిలోని బిస్వన్‌ బిస్వాస్‌ టాపర్‌గా నిలిచాడు. ఎస్టీ కేటగిరీలో ఐఐటీ ఢిల్లీ పరిధిలోని సుముఖ్‌.ఎంజీ ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. సీఆర్‌ఎల్‌ పీడబ్ల్యూడీ కేటగిరీలో ఐఐటీ మద్రాస్‌ పరిధిలోని చుచికాల శ్రీచరణ్‌ టాపర్‌గా నిలిచాడు. జనరల్‌ ఈడబ్ల్యూస్‌ పీడబ్ల్యూడీ కేటరిరీలో మద్రాస్‌ ఐఐటీ పరిధిలోని గూడ జోష్మిత టాప్‌ ర్యాంకు సాధించింది. ఓబీసీ ఎన్‌సీఎల్‌ పీడబ్ల్యూడీ కేటగిరీలో ఐఐటీ బాంబేకు చెందిన పార్ట్‌ బావున్‌కులే మొదటి స్థానం సాధించాడు. ఎస్సీ పీడబ్లూడీ, ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ గౌహతి పరిధిలోని హేమంత్‌ గోద్వే, సంజ్ఞ నోర్పెల్‌ షెర్పా మొదటి టాప్‌ ర్యాంకులు సాధించారు.