Kalki 2898 AD
Kalki 2898 AD: ఇక ఈనెల 27వ తేదీన ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుంది అంటూ సినిమా యూనిట్ ఈ సినిమా మీద చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉండడం వల్లే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా చాలా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
క అందులో భాగంగానే ప్రైమ్ వీడియోలో ‘బుజ్జి అండ్ భైరవ’ కు సంబంధించిన ఆనిమేటెడ్ వీడియోని కూడా రిలీజ్ చేసి సినిమా మీద మంచి అంచనాలైతే పెంచారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా క్లాస్ మాస్ ఆడియెన్స్ లో ఎవరిని ఎక్కువగా ఆకట్టుకుంటుంది అనే అనుమానలైతే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా టీజర్ ని చూస్తుంటే ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన సినిమా అని మనకు చాలా క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. మరి ఇందులో మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే అంశాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఇక ప్రభాస్ అంటే మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఆయన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఏ మాత్రం తగ్గిన కూడా ప్రేక్షకుడు సాటిస్ఫై అవ్వలేడు. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని నాగ్ అశ్విన్ ఈ సినిమాని క్లాస్ మాస్ రెండు యాంగిల్స్ లో మెప్పించే విధంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తుంది. ఇక నిజానికి మాస్ ప్రేక్షకులు సాటిస్ఫై అయితేనే సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే క్లాస్ ఆడియెన్స్ సినిమాని ఒక్కసారి మాత్రమే చూసి ఎంజాయ్ చేస్తారు.
కానీ మాస్ అభిమానులు మాత్రం సినిమా నచ్చితే దాన్ని రిపీటెడ్ గా చూస్తూ సినిమా కలెక్షన్స్ ని పెంచడంలో వాళ్ళు చాలా వరకు దోహదపడతారు. కాబట్టి స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడైనా మాస్ ఆడియన్స్ ని బేస్ చేసుకొని తీస్తూ ఉంటారు. ఇక ఇంతకు ముందు కూడ అలాంటి సినిమాలు మాత్రమే ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: How is prabhas kalki 2898 ad going to be
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com