Heroes who missed Kishkindhapuri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు పోటీ పడుతూ ముందుకు దూసుకెళుతున్న ఏకైక నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్… అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఆయన మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన గుర్తింపుతో వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే ఆయనకు ఆ సినిమాలేవీ పెద్దగా ఆశించిన విజయం సాధించి పెట్టకపోవడంతో తన పంథాను మార్చుకొని మొదటిసారి ‘కిష్కిందపురి’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది… ప్రస్తుతం థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఒకవైపు మిరాయి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని మరి ఈ సినిమా నిలబడుతుంది అంటే కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు…బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. మరి ఇలాంటి ఒక సినిమాని దర్శకుడు ప్రదీప్ మొదటి కొంతమంది హీరోలకు వినిపించారట.
కానీ ఆ హీరోలు ఈ కథకి నో చెప్పడంతో ఈ సినిమాని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేసినట్టుగా గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మొదట ఈ కథని సాయిధరమ్ తేజ్ కి వినిపించారట. ఆయన అప్పటికే కొన్ని సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
కథ మాత్రం అతనికి బాగా నచ్చిందట, కానీ సినిమాను మాత్రం చేయలేకపోయాడు. ఇక ఆ తర్వాత నిఖిల్ కి కూడా ఈ సినిమా స్టోరీ నైతే చెప్పారట. ఆయన కూడా ఈ సినిమా పట్ల ఇంప్రెస్ అయినప్పటికి కమిట్ మెంట్స్ వల్ల ఈ సినిమా చేయలేకపోయాడు. మరి మొత్తానికైతే వాళ్ళిద్దరూ నో చెప్పిన స్టోరీ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నమ్మి చేశాడు.
మొత్తానికైతే ఈ సినిమా అతనికి ఒక మంచి సక్సెస్ అయితే కట్టబెట్టిందనే చెప్పాలి. ఈ సంవత్సరం మొదట్లో ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం కిష్కింధపురి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…