Ustad Bhagat Singh updates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప క్రేజ్ ను సంపాదించి పెట్టడమే కాకుండా జనాల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి 2024 ఎలక్షన్స్ కి ముందు కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు…ఇక ఇప్పటికే ఈ సంవత్సరం ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు. ఇక ఈనెల 25వ తేదీన ఓజీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు సంబంధించిన షూటింగ్ నిన్న పూర్తి చేశారు. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అలాగే హరీష్ శంకర్ రాసిన డైలాగులు చాలా అద్భుతంగా పేలుతాయని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.
ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ ఏ రేంజ్ లో క్లిక్ అయిందో అంతకు మించినా సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయట. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కమర్షియల్ యాంగిల్ లో చాలా కంఫర్ట్ గా నటించి సక్సెస్ ని సాధించడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.
ఇక హరీష్ శంకర్ ఇంతకుముందు చేసిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన చాలావరకు డీలాపడ్డాడు. ఇక తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…
ఇక పవన్ కళ్యాణ్ కి ఓజీ సినిమాతో సూపర్ సక్సెస్ దక్కితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉంటాయి. మరి ఈ సినిమాలు పవన్ కళ్యాణ్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ లుగా నిలుస్తాయా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…