వంటలక్కను మహానటితో పోలుస్తున్న ఫ్యాన్స్.. ఆమె ఏమందంటే..?

సీరియళ్లు అంటే ఆసక్తి చూపే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కార్తీకదీపం సీరియల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర ద్వారా ప్రేమీ విశ్వనాథ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారు. స్టార్ మా ఛానెల్ లో రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రతి వారం భారీ టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ బుల్లితెరపై అరుదైన రికార్డులను సృష్టిస్తోంది. Also Read: ఎన్టీఆర్ ముందు మహేష్ […]

Written By: Navya, Updated On : January 5, 2021 3:13 pm
Follow us on


సీరియళ్లు అంటే ఆసక్తి చూపే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కార్తీకదీపం సీరియల్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్ లో వంటలక్క పాత్ర ద్వారా ప్రేమీ విశ్వనాథ్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారు. స్టార్ మా ఛానెల్ లో రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ ప్రతి వారం భారీ టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటూ బుల్లితెరపై అరుదైన రికార్డులను సృష్టిస్తోంది.

Also Read: ఎన్టీఆర్ ముందు మహేష్ నిలబడగలడా..?

మలయాళంలో కరతముత్తు అనే సీరియల్ ద్వారా టీవీ రంగంలో కెరీర్ ను ప్రారంభించిన ప్రేమీ విశ్వనాథ్ అనతి కాలంలోనే నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల ప్రేమీ విశ్వనాథ్ కు తెలుగులో సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ ఏడాది ప్రేమీ విశ్వనాథ్ నటించిన ఒక సినిమా విడుదల కానుంది. అయితే ప్రేమీ విశ్వనాథ్ ను అభిమానించే కొందరు అభిమానులు ఆమెను మహానటి సావిత్రితో పోలుస్తున్నారు.

Also Read: సీనియర్ ఎన్టీఆర్ – మెగాస్టార్’ వాయిస్ ఓవర్ తో ‘తారక్ – చరణ్’ టీజర్ !

నటన విషయంలో సావిత్రి అంత గొప్పగా ప్రేమీ విశ్వనాథ్ కార్తీక దీపం సీరియల్ లో నటిస్తోందంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహానటి సావిత్రితో పోల్చడం ప్రేమీ విశ్వనాథ్ దృష్టికి రావడంతో ఆమె స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అభిమానులు సావిత్రితో పోల్చడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ప్రేమీ విశ్వనాథ్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

సావిత్రి నటనలో కొంచెం చేసినా తన జన్మ ధన్యమవుతుందంటూ ప్రేమీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతున్న ఈ సీరియల్ ను సాగదీస్తున్నారని కొందరు అభిమానులు చెబుతున్నా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ లు వంటలక్క, డాక్టర్ బాబు పాత్రల్లో జీవిస్తూ ఈ సీరియల్ కు ఆదరణ అంతకంతకూ పెరిగేలా చేస్తుండటం గమనార్హం.