ఓటమిని ఇంకా ఒప్పుకోని ట్రంప్: 6న నిరసన ర్యాలీ

అమెరికా అధ్యక్షుడ డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని ఒప్పుకోవడం లేదు. త్వరలో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసే సమయంలో ఆయన ఎన్నికల ఫలితాలపై భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటిపంచారు. ఇప్పటికే తాను ఓడిపోలేదని, సాక్ష్యాలు సమర్పించి తామే గెలుస్తామని ట్రంప్ నమ్మబలుకుతున్నాడు. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. ట్రంప్ నకు 230 ఎలక్టోరల్ ఓట్లు రాగా జో బైడెన్ […]

Written By: Suresh, Updated On : January 3, 2021 2:28 pm
Follow us on

అమెరికా అధ్యక్షుడ డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని ఒప్పుకోవడం లేదు. త్వరలో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసే సమయంలో ఆయన ఎన్నికల ఫలితాలపై భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటిపంచారు. ఇప్పటికే తాను ఓడిపోలేదని, సాక్ష్యాలు సమర్పించి తామే గెలుస్తామని ట్రంప్ నమ్మబలుకుతున్నాడు. గత నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. ట్రంప్ నకు 230 ఎలక్టోరల్ ఓట్లు రాగా జో బైడెన్ 300కు పైగా ఓట్లు సాధించాడు. దీంతో ఆయన త్వరలో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. అయితే ట్రంప్ ఓడిపోతున్నానని తెలిసే సమయంలో నుంచి ఎన్నికల్లో అక్రమాలు సాగాయంటూ వాదిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోర్టులకు వెల్లి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఏ కోర్టు ట్రంపునకు అనుకూలంగా తీర్పునివ్వలేదు. అయినా తాను ఓటమిని ఓప్పుకోనని పట్టుబడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 6న తన మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాడు. కాగా ఈనెల 20న జో బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.