https://oktelugu.com/

విశాఖకు రాజధాని తరలింపు.. : డేట్‌ కూడా ఫిక్స్‌

జగన్‌ అధికారం చేపట్టాక రాజధానిగా అమరావతిని మారుస్తూ.. మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. మరోవైపు అమరావతి కేంద్రంగా రైతు ఉద్యమం నడుస్తూనే ఉంది. మరి ఇలాంటి సమయంలో జగన్‌ సర్కార్‌‌ సంచలన ప్రకటన చేసింది. విశాఖపట్నంకు పరిపాలనా రాజధానిని తరలించడంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. Also Read: దేవుడితో రాజకీయం.. అడ్డంగా దొరికిన చంద్రబాబు? తెలుగు వారి కొత్త సంవత్సం […]

Written By: , Updated On : January 3, 2021 / 02:43 PM IST
Follow us on

AP Capital Shift
జగన్‌ అధికారం చేపట్టాక రాజధానిగా అమరావతిని మారుస్తూ.. మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. మరోవైపు అమరావతి కేంద్రంగా రైతు ఉద్యమం నడుస్తూనే ఉంది. మరి ఇలాంటి సమయంలో జగన్‌ సర్కార్‌‌ సంచలన ప్రకటన చేసింది. విశాఖపట్నంకు పరిపాలనా రాజధానిని తరలించడంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: దేవుడితో రాజకీయం.. అడ్డంగా దొరికిన చంద్రబాబు?

తెలుగు వారి కొత్త సంవత్సం ఉగాది పండుగ నుంచి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మారబోతోందని ప్రకటించారు. ఇకపై విశాఖలో పరిపాలనా రాజధాని ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉగాది నుంచి చట్టపరంగా విశాఖ నుంచి రాజధానిగా పరిపాలన కొనసాగుతుందని వెల్లడించారు. ఇక, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసంపై టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి బొత్స విమర్శించారు. ఇందులో ముమ్మాటికీ కుట్ర, రాజకీయ కోణం ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో వివరాలన్నీ బయటకి వస్తాయని ప్రకటించారు. రామతీర్థం ఆలయాన్ని అభివృద్ధి చేసింది తన భార్య బొత్స ఝాన్సీ అని మంత్రి వెల్లడించారు.

అశోక్ గజపతిరాజు ట్రస్టీగా ఉండి కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. రామతీర్థం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనకు ముందు రోజే టీడీపీ ఈ కుట్ర చేసిందని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: ఆంధ్రలో దేవాలయాలపై దాడుల వెనక మర్మమేంటి?

రామతీర్థ ఆలయాన్ని తామే అభివృద్ధి చేశామన్న మంత్రి బొత్స.. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని వెల్లడించారు. రామతీర్థంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని మంత్రి బొత్స హెచ్చరించారు. మొత్తంగా బొత్స వ్యాఖ్యలతో హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే పాలన రాజధానిని విశాఖకు తరలించే ఏర్పాట్లలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్