స్త్రీ, పురుషుల మధ్య బంధం ఏర్పడాలంటే ఒక్క క్షణం చాలు. ఆ క్షణం అమ్మాయి లేదా అబ్బాయి తొలి చూపులో ఉన్న ఆకర్షణ కారణంగా వారి మధ్య బంధం ఏర్పడుతుంది. ఆయితే సమాజంలో ఎంత మంది ఉన్నా కొంత మంది అమ్మాయిలు తమకు ఇష్టమైన అబ్బాయిలను సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని విషయాలను బాగా పరిశీలిస్తారు. అందం విషయంలో అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా ఫెయిర్ గా ఉన్నప్పుడే వారిని ఇష్టపడుతారు. ఇందుకోసం అబ్బాయిలు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో చూద్దాం..
ఒక అబ్బాయిని అమ్మాయి బాగా ఇష్టపడాలంటే శుచి, శుభ్రత పాటించాలి. ముఖ్యంగా శరీరం నుంచి మంచి సువాసన రావడానికి ఫర్ ఫ్యూమ్ అలవాటు చేసుకోవాలి. సువాసనను గ్రహించి కొందరు లైక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వేసవి కాలంలో బయటకు వెళ్లినప్పుడు ఇవి తప్పనిసరిగా వాడాలి. అయితే ఇవి క్వాలిటీవి ఉండే విధంగా చూసుకోవాలి.
ఎదుటివారికి నచ్చాలంటే లుక్ ఫెయిర్ గా ఉండాలి. డ్రెస్సింగ్ విషయంలో అబ్బాయిలు కేర్ తీసుకోవాలి. ఇన్ సెట్ వేసుకున్న వారిని బాగా లైక్ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు సందర్భాన్ని బట్టి షూ ధరించిన వారిని లైక్ చేస్తారు. జీన్స్, టీషర్ట్ వేసుకున్న వారి కంటే షర్ట్, ట్రూజర్ వేసుకొని నీట్ గా ఉన్న వారిని ఎక్కువగా ఇష్టపడుతారు.
అమ్మాయిలు అందంగా కనిపించాలంటే కొన్ని ఆభరణాలు ధరిస్తారు. కానీ మగవారికి అలాంటి వి ఉండవు. కానీ చేతికి వాచి లాంటివి ధరించడం వల్ల అందంగా కనిపిస్తారు. కొందరికి వాచ్ ధరించడం ఇష్టముండదు. కానీ ఇష్టం లేకపోయినా వాచ్ ధరించడం వల్ల ఎదుటివారికి ఆకర్షించగలుగుతారు.
మగవారి హెయిర్ స్టైల్ బాగున్నవారిని కూడా అమ్మాయిలు ఎక్కువగా చూస్తారు. హెయిర్ స్టెయిల్ తో పాటు క్లీన్ షేవ్ చేసుకున్న వారిని బాగా లైక్ చేస్తారు. అందువల్ల ఎక్కువ శాతం క్లీన్ గా ఉండేందుకు ప్రయత్నించాలి.