Balakrishna: ఆ హీరోయిన్ బాలయ్యకు తల్లి కాని తల్లి అయ్యింది… తండ్రి ఎన్టీఆర్ అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?

నందమూరి తారక రామారావు లెజెండరీ నటుడు. దశాబ్దాల పాటు ఆయన సిల్వర్ స్క్రీన్ ని ఏలారు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ప్రస్థానం సాగించారు. కెరీర్ ప్రారంభంలో పాతాళ భైరవి, మిస్సమ్మ వంటి క్లాసిక్స్ లో నటించారు. ఇక పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, కర్ణుడు వంటి ఐకానిక్ రోల్స్ చేసి ఎన్టీఆర్ వెండితెర ఇలవేల్పు అయ్యాడు. ఈ పాత్రలకు ఎన్టీఆర్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేము. మూడు తరాల హీరోయిన్స్ తో ఎన్టీఆర్ జతకట్టారు. 70-80లలో ఎన్టీఆర్ మాస్ కమర్షియల్ చిత్రాలు చేశారు.

Written By: S Reddy, Updated On : July 16, 2024 8:54 am

Balakrishna

Follow us on

Balakrishna: ఎన్టీఆర్ ఓ స్టార్ హీరోయిన్ ని బాలయ్యకు అనుకోకుండా తల్లిని చేశాడు. ఆయన నిర్ణయంతో బాలకృష్ణ ఖంగుతిన్నాడు. తండ్రి మాట ప్రకారం బాలయ్య ఆమెను అలానే చూశాడు. దీని వెనకున్న ఆసక్తికర కథనం ఏమిటో చూద్దాం.

నందమూరి తారక రామారావు లెజెండరీ నటుడు. దశాబ్దాల పాటు ఆయన సిల్వర్ స్క్రీన్ ని ఏలారు. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ప్రస్థానం సాగించారు. కెరీర్ ప్రారంభంలో పాతాళ భైరవి, మిస్సమ్మ వంటి క్లాసిక్స్ లో నటించారు. ఇక పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు. ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు, కర్ణుడు వంటి ఐకానిక్ రోల్స్ చేసి ఎన్టీఆర్ వెండితెర ఇలవేల్పు అయ్యాడు. ఈ పాత్రలకు ఎన్టీఆర్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేము.

Also Read: చిరంజీవి ఎందుకు ఆ సినిమాను వదిలేశాడో తెలుసా..? ఆ సినిమాతో మోహన్ బాబు స్టార్ హీరో అయిపోయాడుగా

మూడు తరాల హీరోయిన్స్ తో ఎన్టీఆర్ జతకట్టారు. 70-80లలో ఎన్టీఆర్ మాస్ కమర్షియల్ చిత్రాలు చేశారు. అవి బాక్సాఫీస్ షేక్ చేశాయి. అప్పుడు జయప్రద, జయసుధ, శ్రీదేవి ఆయనతో జతకట్టారు. ఎన్టీఆర్ ప్రతి చిత్రంలో దాదాపు ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఎవరో ఒకరు ఉండేవారు. ముఖ్యంగా శ్రీదేవితో ఆయన బ్లాక్ బస్టర్స్ నమోదు చేశారు.

శ్రీదేవి బాల్యంలో ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించడం విశేషం. స్టార్ హీరోయిన్ అయ్యాక ఆమె ఎన్టీఆర్ తో జతకట్టింది. వీరిద్దరి కాంబినేషన్ లో సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, కొండవీటి సింహం, వేటగాడు, గజదొంగ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ఎన్టీఆర్-శ్రీదేవి కాంబోకి జనాల్లో ఒక క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దూరం అయ్యారు. ఆయన వారసుడు బాలకృష్ణ హీరో అయ్యారు.

కాగా ఎన్టీఆర్ తర్వాత తరం స్టార్ హీరోలతో కూడా శ్రీదేవి నటించింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఆమెతో చిత్రాలు చేశారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణం క్షణం మూవీలో వెంకటేష్-శ్రీదేవి జంటగా నటించారు. అలాగే గోవిందా గోవిందా మూవీలో నాగార్జునతో శ్రీదేవి జతకట్టింది. ఇక చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఆల్ టైం బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.

కానీ బాలకృష్ణతో శ్రీదేవి ఒక్క చిత్రం కూడా చేయలేదు. వీరిద్దరూ హీరో-హీరోయిన్ గా కలిసి నటించలేదు. ఇందుకు కారణం ఏమిటనే చర్చ చాలా కాలంగా ఉంది. అందుకు తండ్రి ఎన్టీఆర్ కారణం అంటారు. తన పక్కన హీరోయిన్ గా చేసిన శ్రీదేవిని తల్లిగా భావించాలని బాలకృష్ణకు ఎన్టీఆర్ సూచించాడట. ఆమె నీకు తల్లిలాంటిది. శ్రీదేవితో రొమాన్స్ చేయకు. నీకు జంటగా శ్రీదేవి నటించకూడదు అన్నారట.

ఎన్టీఆర్ కి మనవరాలుగా, ప్రియురాలిగా చేసిన శ్రీదేవి మరలా ఆయన కొడుకు పక్కన హీరోయిన్ గా నటించడం అనే ఆలోచన ఇబ్బంది పెట్టిందట. అందుకే బాలయ్యకు గట్టి సూచన చేశాడట. తండ్రి మాటకు కట్టుబడి అతిలోక సుందరితో నటించాలన్న బాలకృష్ణ తన కోరిక అణచుకున్నాడట. బాలకృష్ణ-శ్రీదేవి ఒక్క సినిమా కూడా జంటగా చేయలేదు.

కాగా ఏళ్ల తర్వాత ఎన్టీఆర్-శ్రీదేవి వారసుల కాంబో సెట్ కావడం అనూహ్య పరిణామం. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ తో దేవర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మనవడు, శ్రీదేవి కూతురు కాంబోలో వస్తున్న దేవర మూవీపై ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. దేవర షూటింగ్ చివరి దశకు చేరుకోగా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది.

Also Read: మాల్వి మల్హోత్రా ఆ ప్రొడ్యూసర్ ని ఛీట్ చేసిందా… రాజ్ తరుణ్-లావణ్య వివాదంలో కొత్త మలుపు, హీరోయిన్ పై మరో కేసు నమోదు!