Chiranjeevi: చిరంజీవి ఎందుకు ఆ సినిమాను వదిలేశాడో తెలుసా..? ఆ సినిమాతో మోహన్ బాబు స్టార్ హీరో అయిపోయాడుగా…

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ' సైరా ' లాంటి ఒక ప్రయోగాత్మకమైన సినిమాను చేసి ప్రేక్షకులను మెప్పించాడు. నిజానికి ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చిరంజీవి మాత్రం ఆ సినిమా కోసం చాలా విపరీతంగా కష్టపడిన విషయం మనందరికీ తెలిసిందే...ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా ఆయన విశ్వంభర సినిమాతో మరోసారి సోషియో ఫాంటసీ సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒకప్పుడు చిరంజీవి చేసిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ఫార్మాట్లోనే ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి అలాంటి చిరంజీవి ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

Written By: Gopi, Updated On : July 16, 2024 8:40 am

Chiranjeevi

Follow us on

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఏలుతున్న ఒకే ఒక హీరో ‘మెగాస్టార్ చిరంజీవి’… ఇప్పటికి కూడా ఆయన మంచి సినిమాలు చేసి ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. నిజానికి సీనియర్ హీరోలందరూ కూడా ఇప్పుడు తెలుగుకి మాత్రమే పరిమితం అవుతుంటే, చిరంజీవి మాత్రం ఎంతో సాహసోపేతమైన సినిమాలను చేస్తూ పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఇంతకు ముందు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ‘ సైరా ‘ లాంటి ఒక ప్రయోగాత్మకమైన సినిమాను చేసి ప్రేక్షకులను మెప్పించాడు. నిజానికి ఆ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా చిరంజీవి మాత్రం ఆ సినిమా కోసం చాలా విపరీతంగా కష్టపడిన విషయం మనందరికీ తెలిసిందే…ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా ఆయన విశ్వంభర సినిమాతో మరోసారి సోషియో ఫాంటసీ సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒకప్పుడు చిరంజీవి చేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఫార్మాట్లోనే ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి అలాంటి చిరంజీవి ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక చిరంజీవి మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు బి. గోపాల్ దర్శకత్వంలో ‘అసెంబ్లీ రౌడీ’ అనే సినిమా చేయాల్సింది.

కానీ ఆ టైమ్ లో వరుసగా ఐదు సినిమాలకు కమిట్ అయిన చిరంజీవి ఆ డేట్స్ ను అడ్జస్ట్ చేయలేకపోయాడు. దాంతో చిరంజీవి బి.గోపాల్ ని ఆ సినిమా వేరే వాళ్ళతో చేయండి కావాలంటే మనం నెక్స్ట్ మరొక సినిమా చేద్దామని చెప్పారట..ఇక అప్పుడు బి. గోపాల్ ఈ సినిమాను మోహన్ బాబు తో చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక మోహన్ బాబు కెరియర్ లోనే ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతోనే మోహన్ బాబు స్టార్ హీరోగా నిలబడ్డాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి వదిలేసిన సినిమాతో మోహన్ బాబు సక్సెస్ ని అందుకొని చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడం నిజంగా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి.

ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత బి. గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో ఇంద్ర లాంటి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చింది. ఇక మొత్తానికైతే చిరంజీవి చేయాల్సిన సబ్జెక్టుని మోహన్ బాబు చేయడం అనేది నిజంగా ఆయన కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అయింది…ఇక ఈ ఒక్క హిట్టుతో మోహన్ బాబు ఫుల్ టైం హీరోగా మారిపోయి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక అందులో భాగంగానే రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘పెద రాయుడు ‘ అనే సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ని కూడా కొట్టాడు. అలాంటి మోహన్ బాబు 500 కు పైగా సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా ఎదగడమే కాకుండా చాలా అవార్డులను కూడా అందుకున్నాడు.

కానీ ఇప్పుడు మాత్రం ఆయన చేసే చేష్టలు చాలా మందికి నచ్చడం లేదు. ఏదైనా ఈవెంట్ లో ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద సెటైర్లు వేయడం చూసిన జనాలు ఆయన సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించలేకపోతున్నారు. దానివల్ల ఆయనకు మార్కెట్ కూడా భారీ గా డౌన్ అయింది. ఇక సినిమాలు చేయడం కూడా ఆపేసినట్టుగా తెలుస్తుంది. అడపాదడపా తన కొడుకుల సినిమాల్లోనే చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…