https://oktelugu.com/

Horoscope Today: కర్కాటకంలో సూర్యుడి ప్రయాణం.. రాజకీయ నాయకులకు ఈరోజు అనుకోని ఆర్థిక ప్రయోజనాలు…

వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశం. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. మకర రాశి వారు పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సమస్యలపై ఫోకస్ పెడుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 16, 2024 / 09:00 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: 2024 జూలై 16 మంగళవారం రోజున ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. మంగళవారం కర్కాటక రాశిలో సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. తల్లిదండ్రులతో కలిసి సేవా కార్యాక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.సాయంత్రం స్నేహితులను కలుస్తారు.

    వృషభ రాశి:
    మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

    మిథున రాశి:
    వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు అనుకూల వాతావరణం. వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశం. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

    కర్కాటక రాశి:
    కొన్ని పనులు సులభంగా పూర్తి చేస్తారు. కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. బాకీలు వసూలవుతాయి.

    సింహారాశి:
    ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఎక్కువగా వాదనలకు దిగకండి. ప్రత్యర్థులు పక్కనే ఉంటారు. వారిని గమనించే పనులు కొనసాగించాలి.

    కన్య రాశి:
    కొన్ని కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెడుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. లేకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు పడుతారు.

    తుల రాశి:
    ఉద్యోగులు డబ్బు కొరతను ఎదుర్కొంటారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కష్టపడుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    వృశ్చిక రాశి:
    ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామి బంధువుల నుంచి డబ్బు అందుతుంది. కొన్ని రంగాల వారికి కష్టాలు తీరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

    ధనస్సు రాశి:
    రాజకీయ నాయకులు అనుకోని ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు ఖర్చులు పెరుగుతాయి. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు విజయం సాధిస్తారు.

    మకర రాశి:
    పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల సమస్యలపై ఫోకస్ పెడుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులకు బహుమతిని కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్త వింటారు. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి.

    కుంభరాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. తోటి వారితో సమస్యలు ఉండే అవకాశం. వ్యాపారులకు పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కొన్ని రంగాల నుంచి అనుకోని ఆదాయం వచ్చే అవకాశం. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి.

    మీనరాశి:
    వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇంటికి అతిథుల రాకతో సందడిగా మారుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ పై శుభవార్త వింటారు.