Anushka Shetty: 2005వ సంవత్సరంలో సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క ఆ సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో సోలో హీరోయిన్ గా నటించడమే కాకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఇక ముఖ్యంగా అనుష్క చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి. అయితే అనుష్క పెళ్లి మీద చాలా రోజులనుంచి వార్తలైతే వస్తున్నాయి. ఆమె పెళ్లి మీద గత 10 సంవత్సరాల నుంచి పలు రకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. అందులో మొదటగా గోపీచంద్ పేరు వినిపించినప్పటికీ అది ఫేక్ అని తెలిసిపోయింది.
ఇక ఆ తర్వాత ప్రభాస్ తో అనుష్క నాలుగు సినిమాల్లో నటించింది. కాబట్టి ప్రభాస్ ను అనుష్క ప్రేమిస్తుంది ఆయన్నే పెళ్లి చేసుకుంటుంది అనే వార్తలైతే వచ్చాయి. అది కూడా ఫేక్ న్యూస్ అని తెలిసిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ కూడా పెళ్లి చేసుకోలేదు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క ఒక ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకోవడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలైతే ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన వయస్సు 42 సంవత్సరాలట. ఇక అనుష్క కూడా 40 ప్లస్ లోనే ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి మొత్తానికైతే అనుష్క ఇప్పటికైనా పెళ్లి చేసుకొని తన పర్సనల్ లైఫ్ ను సాఫీగా కొనసాగిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఎక్కడ కూడా రానప్పటికీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే అనుష్క తొందర్లోనే ఒక ప్రొడ్యూసర్ ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలైతే ఎక్కువగా వినిపిస్తున్నాయి…
ఇక ఇదిలా ఉంటే అనుష్క అవకాశం దొరికిన ప్రతిసారి కొన్ని సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన నటనను కనబరుస్తుంది. ఇక ఇప్పటికే ఆమె బాహుబలి తర్వాత ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ లో ఒక మూవీ అయితే చేస్తుంది ఈ సినిమాతో తను మళ్లీ మంచి పేరు సంపాదించుకోవాలని చూస్తుంది…