Allu Arjun: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ 3 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయనే విషయం మీకు తెలుసా..?

పుష్ప సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో పుష్ప 2 మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాతో కూడా ఆయన భారీ హిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 17, 2024 8:24 am

Allu Arjun

Follow us on

Allu Arjun: గంగోత్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్..ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ అల్లుఅర్జున్ కి రావాల్సిన గుర్తింపైతే రాలేదు. కానీ ఆ తర్వాత చేసిన ‘ఆర్య ‘ సినిమాతో ఒక్కసారిగా తను స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడు. ఇక యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోవడమే కాకుండా స్టైలిష్ స్టార్ గా కూడా ఎదిగాడు. ఇక ఆ తర్వాత తనకంటూ ఇక మంచి గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరోసారి పాన్ ఇండియా లో తన లక్కుని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక ఇప్పటికే పుష్ప సూపర్ డూపర్ సక్సెస్ అవడంతో పుష్ప 2 మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాతో కూడా ఆయన భారీ హిట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ని కనక మనం చూసినట్లైతే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే తన కెరీయర్ లో వదిలేసిన మూడు సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లుగా మారాయనే విషయం మనలో చాలామందికి తెలియదు.

అవి ఏ సినిమాలు అంటే ఒకటి రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా కాగా, మరొకటి విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం..ఇక ఈ రెండింటితో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా కూడా అల్లు అర్జున్ చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాను తరువాత వదిలేసుకోవాల్సి వచ్చింది.

ఇక మొత్తానికైతే ఈ మూడు సినిమాలు ఆ హీరోల కెరీయర్ లో మంచి సక్సెస్ లుగా మిగిలాయి. ఇక ఈ సినిమాలను అల్లు అర్జున్ చేసి ఉంటే ఆయన కెరియర్లోనే టాప్ పొజీషన్ కి వెళ్లవాడంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని అయితే తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో భారీ హిట్ కొట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…