Gold Rates Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు.. నేడు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే17న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.74,020 గా ఉంది.

Written By: Chai Muchhata, Updated On : May 17, 2024 8:30 am

Gold Rates Today

Follow us on

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు పెరిగి గరిస్థ స్థాయికి వచ్చాయి. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 23978 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 29.67 డాలర్ల వద్ద నమోదవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

బులియన్ మార్కెట్ ప్రకారం.. మే17న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.74,020 గా ఉంది. మే 16న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..67,150తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.700 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,010 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.74,180గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,850 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.74,020 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,950 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,020తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,020తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,850తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,020తో విక్రయిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.92,600గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.700 పెరిగింది . ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.89,200గా ఉంది. ముంబైలో రూ.89,200, చెన్నైలో రూ.92,600, బెంగుళూరులో 88,600, హైదరాబాద్ లో రూ.92,600తో విక్రయిస్తున్నారు.