Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Star Heroine: ఇండస్ట్రీలో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Star Heroine: ఇండస్ట్రీలో రూ. 100 కోట్లు కొల్లగొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?

కోలీవుడ్ లో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా శివాజీ-ది బాస్ పేరు సంపాదించింది. ఇందులో రజనీకాంత్ సరసన శ్రియ నటించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Star Heroine: చిత్ర పరిశ్రమలోకి కొందరు వస్తుంటారు. వెళ్తుంటారు. లక్, టాలెంట్, అద్భుతమైన నటన ఉంటే కొంత కాలం ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతారు. కానీ కొందరు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారు. ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలో అనుష్క, కీర్తి సురేష్, త్రిష వంటి స్టార్ హీరోయిన్ లు నటనతో ఆకట్టుకుంటున్నా తమిళ ఇండస్ట్రీకి మాత్రం రూ. 100 కోట్ల సినిమాను అందించలేక పోయారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం కెరీర్ తొలినాళ్లలోనే కోలీవుడ్ కు రూ. 100 కోట్ల చిత్రాన్ని అందించి సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.

కోలీవుడ్ లో రూ. 100 కోట్లు వసూలు చేసిన మొదటి సినిమా శివాజీ-ది బాస్ పేరు సంపాదించింది. ఇందులో రజనీకాంత్ సరసన శ్రియ నటించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. పాపులర్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో మొదటగా ఐశ్వర్య రాయ్ కి అవకాశం వచ్చిందట. కానీ బిజీ షెడ్యూల్ కారణం వల్ల ఈమె సినిమాను ఒప్పుకోలేదు. ఇక ఇదే మూవీతో శ్రియకు స్టార్ డమ్ అంది వచ్చింది. రూ. 60 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 148 కోట్లను వసూలు చేసింది.

మొట్టమొదటిగా కోలీవుడ్ హీరోయిన్ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఇదే మొదటి సినిమా. ఈ చిత్రం తర్వాత అనేక చిత్రాల్లో మెప్పించింది శ్రియా. ఇక ఇష్టం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అంతేకాదు ఈ సినిమా థియేటర్ లలో విడుదల కాకముందే నాలుగు సినిమా ఆఫర్లను కూడా కొట్టేసింది. ఇక టాలీవుడ్ లో నువ్వే నువ్వే సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఠాగూర్ లో చిరంజీవి, ఛత్రపతి లో ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.

బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసుకుంది శ్రియ. సంతోషం, కంఠస్వామి, దృశ్యం, అర్జున్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ లలో నటించింది. ఒక్కో సినిమాకు ఈ అమ్మడు రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇక శ్రియ నికర విలువ రూ. 75 కోట్లకు పైగానే ఉంటుందని టాక్. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు చేసిన తర్వాత మనం సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది. మరి ఈమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper