Prashanth Neel: తెలుగులో ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? తన కెరియర్ లో ఆయనతో ఒక్క సినిమానైనా చేస్తాడట..?

సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో సలార్ 2 సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి అనుకూలంగానే ఈ సినిమాని భారీ అంచనాలతో తెరకెక్కించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఒకసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో బాలీవుడ్ హీరోలందరూ సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆయన మాత్రం సెలెక్టెడ్ గా తెలుగు సినిమా హీరోలను మాత్రమే ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : July 16, 2024 5:35 pm

Prashanth Neel

Follow us on

Prashanth Neel: కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక కే జి ఎఫ్ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. నిజానికి కన్నడ సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది. అసలు ఆ ఇండస్ట్రీని కూడా ఎవరూ లెక్కలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు ఇతర భాషల్లో సక్సెస్ అయిన సినిమాలని అక్కడ రీమేక్ చేసి భారీ సక్సెస్ అందుకుంటూ ఉంటారు.

Also Read: సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ… ఏకంగా కోట్లు కొల్లగొట్టే ప్లాన్

మరి ఇలాంటి క్రమంలో అక్కడి నుంచి ఒక సినిమాను తీసి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ చేసిన ఏకైక దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడం విశేషం… అందువల్ల ఆయనకి భారీ రేంజ్ లో క్రేజ్ అయితే పెరిగింది. మరి దానికి అనుకూలంగానే ఆయన సినిమాలు కూడా భారీ రేంజ్ లో ఉంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ కి తెలుగులో ‘మెగాస్టార్ చిరంజీవి’ అంటే చాలా ఇష్టమట. అందుకే చిరంజీవి తో ఒక్క సినిమా అయిన చేయాలని అనుకుంటున్నాడట. కానీ అవకాశం వస్తుందా లేదా అనే విషయం మీద తనకు క్లారిటీ అయితే లేదట.. ఏ చిన్న అవకాశం వచ్చిన ఆ అవకాశాన్ని వదలకుండా చిరంజీవి గారితో సినిమా చేస్తానని తను తెలియజేశాడు. ఇక ప్రస్తుతం ఆయన ‘సలార్ 2’ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ తో చేస్తున్న మరొక సినిమా మీద కూడా తన ఫోకస్ ని పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక సలార్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో సలార్ 2 సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి అనుకూలంగానే ఈ సినిమాని భారీ అంచనాలతో తెరకెక్కించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఒకసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో బాలీవుడ్ హీరోలందరూ సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆయన మాత్రం సెలెక్టెడ్ గా తెలుగు సినిమా హీరోలను మాత్రమే ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. మరి దానికి కారణం ఏంటి అనే విషయం తెలీదు కానీ ఆయన తెలుగు వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాడు.

ఇక మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఇప్పుడు చాలా బిజీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడనే చెప్పాలి. ఇంకా ప్రశాంత్ నీల్ ఒక్క సినిమా కోసం దాదాపు 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూన రేషన్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి తక్కువ సినిమాలతోనే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈయన కూడా భారీ ఎత్తున పేరు సంపాదించుకొని పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఎక్కువగా యాక్షన్ నేపధ్యం లోనే సినిమాలు చేయడానికి ఆసక్తి అయితే చూపిస్తున్నాడు.

ఇక ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ కూడా ఒక డార్క్ మూడ్ లో ఉంటాయి. దాని వల్ల కొన్ని సీన్లు చూసినప్పుడు హాలీవుడ్ మేకింగ్ లా మనకు అనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఆయన సినిమా సక్సెస్ అవ్వడానికి ఒక మూల కారణం అనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఆయన కన్నడ డైరెక్టర్ అయినప్పటికీ వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగు డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందుతున్నాడు…చూడాలి మరి సలార్ 2 సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…

Also Read: మిర్రర్ సెల్ఫీ తో పిచ్చెక్కిస్తున్న తెలుగు హీరోయిన్.. బ్లాక్ డ్రెస్ అందాలను చూసి కుర్రకారు ఫిదా..