Photo Story: ఈ ఫొటోలోని కుర్రాడు.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా హీరో.. ఎవరో గుర్తుపట్టండి..

చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రెండు రకాల సినిమాలు వస్తున్నాయి. ఒకటి భారీ బడ్జెట్ తో వచ్చేవి.. మరోవైపు లో బడ్జెట్ తో ఉండేవి. కథ బాగుంటే చిన్న సినిమాలు సైతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇవి ముందుగా ఓటీటీలో రిలీజ్ అయి ఆ తరువాత థియేటర్లకు వచ్చాయి. ఇలా చిన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఇందులో నటించిన వారు ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు.

Written By: Chai Muchhata, Updated On : July 16, 2024 5:29 pm

Photo Story

Follow us on

Photo Story: సినిమాల్లో ఒక్క ఛాన్స్ దొరికితే చాలు తమ ప్రతాపం చూపిస్తామని అనేవాళ్లు చాలా మంది కనిపించారు. అలాంటి వారు అవకాశాలు తెచ్చుకొని తమ నటనా బీభత్సంతో ఫేమస్ అయిన వాళ్లు ఉన్నారు. అయితే సినీ ఇండస్ట్రీ అనగానే బ్యాగ్రౌండ్ సపోర్టు ఉండాలి అంటారు. అలా ఉంటేనే పరిశ్రమలో రాణిస్తామని అనుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ప్రతిభను నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరు కొన్ని సినిమాల్లో నటించి ఫేమస్ అయ్యారు. మరోవైపు వీరు పెద్ద పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న వారున్నారు. వారిలో ఓ హీరోకు సంబంధించిన చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

Also Read: మిర్రర్ సెల్ఫీ తో పిచ్చెక్కిస్తున్న తెలుగు హీరోయిన్.. బ్లాక్ డ్రెస్ అందాలను చూసి కుర్రకారు ఫిదా..

చిత్ర పరిశ్రమలో ఇప్పుడు రెండు రకాల సినిమాలు వస్తున్నాయి. ఒకటి భారీ బడ్జెట్ తో వచ్చేవి.. మరోవైపు లో బడ్జెట్ తో ఉండేవి. కథ బాగుంటే చిన్న సినిమాలు సైతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇవి ముందుగా ఓటీటీలో రిలీజ్ అయి ఆ తరువాత థియేటర్లకు వచ్చాయి. ఇలా చిన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఇందులో నటించిన వారు ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో కిరణ్ అబ్బవరం ఒకరు. ముందుగా షార్ట్ ఫిలింస్ లో నటించి ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం నటించింది కొన్ని సినిమాలే అయినా నేటి యూత్ ఐకాన్ హీరోగా నిలిచాడు.

 

kiran abbavaram

కిరణ్ అబ్బవరం చూడ్డానికి బాలీవుడ్ హీరోలా కనిపించినా.. ఇతను తెలుగు కుర్రాడే. ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో ఆయన 1990 జూలై 15న జన్మించాడు. చదువు పూర్తయి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆయనకు ‘రాజావారు రాణిగారు’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈయనకు పెద్దగా పేరు రాలేదు. కానీ ఆ తరువాత 2021 లో వచ్చిన ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ సినిమాతో ఫేమస్ అయ్యాడు. ఆ తరువాత సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ వంటి సినిమాల్లో నటించారు.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం ‘క’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ జూలై 15న రిలీజ్ చేశారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇందులో కిరణ్ అబ్బరం స్టైలీష్ గా కనిపించారు. ఈ మూవీ మొత్తం యాక్షన్ సీన్స్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆయన సోలో సినిమాల్లో మాత్రమే నటించారు. ఇప్పుడు ఆయన మాస్ లుక్ లో కనిపించడంతో ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు.

‘క’ సినిమాను చాలా గ్రాండ్ గా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సుజీత్, సందీప్ అనే ఇద్దరు దర్శకులు పనిచేస్తున్నారు. రూ.20 కోట్ల బడ్జెట్ తో నిర్మించే ఈ మూవీని వచ్చే సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ తరుణంలో కిరణ్ అబ్బరం చిన్న నాటి ఫొటోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కిరణ్ అప్పుడే ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. అనుకున్నట్లుగానే ఇప్పుడు సినిమాల్లో తనదైన స్టైలిష్ లుక్ తో అలరిస్తున్నాడు. అయితే కిరణ్ అబ్బవరం లేటేస్ట్ మూవీతో ఎలా అలరించనున్నాడో చూద్దాం..

Also Read: సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ… ఏకంగా కోట్లు కొల్లగొట్టే ప్లాన్!