https://oktelugu.com/

Shraddha Das: మిర్రర్ సెల్ఫీ తో పిచ్చెక్కిస్తున్న తెలుగు హీరోయిన్.. బ్లాక్ డ్రెస్ అందాలను చూసి కుర్రకారు ఫిదా..

అల్లరి నరేష్ కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా ఆ మధ్య లవ్ యాంగిల్ సినిమాలు కూడా చేశారు. వాటిలో ‘సిద్ధు ఫ్రం సికాకుళం’ ఒకటి. ఈ మూవీలో శ్రద్ధా దాస్ మొట్ట మొదటిసారిగా కనిపించింది. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించడంతో ఎవరూ గుర్తు పట్టలేదు. ఆ తరువాత జగపతి బాబు హీరోగా వచ్చిన ‘అధినేత’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు పేరు రాలేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 16, 2024 / 04:14 PM IST

    Shraddha Das

    Follow us on

    Shraddha Das: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే ఆషామాషీ కాదు. ఎన్నో ఆశలు, కలలు నెరవేర్చుకోవాలని చిత్ర పరిశ్రమకు వస్తారు. కానీ ఇందులో కొందరు మాత్రమే స్టార్లు అవుతారు. మరికొందరు ఎంత ప్రయత్నించినా సరైన గుర్తింపు రాదు. ముఖ్యంగా కొందరు యువతులు హీరోయిన్ కావాలనే ఆశతో చిత్ర రంగంలోకి వస్తారు. కానీ సైడ్ హీరోయిన్ లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే మిగిలిపోతారు. కానీ చిన్న చిన్న పాత్రలు చేసినా వీరు గుర్తిండిపోతారు. హీరేయిన్ లెవల్లో వీరికీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి వారిలో శ్రద్ధా దాస్ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఈ అమ్మడుకు సరైన గుర్తింపు రావడం లేదు. కానీ తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. శ్రద్ధా దాస్ అంటే ఎవరో తెలిసేలా చేసింది. అయితే ఇప్పుడు ఆమె ఎలా ఉందో చూడండి..

    అల్లరి నరేష్ కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా ఆ మధ్య లవ్ యాంగిల్ సినిమాలు కూడా చేశారు. వాటిలో ‘సిద్ధు ఫ్రం సికాకుళం’ ఒకటి. ఈ మూవీలో శ్రద్ధా దాస్ మొట్ట మొదటిసారిగా కనిపించింది. అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించడంతో ఎవరూ గుర్తు పట్టలేదు. ఆ తరువాత జగపతి బాబు హీరోగా వచ్చిన ‘అధినేత’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు పేరు రాలేదు. కానీ ఆ తరువాత అల్లు అర్జున్ ‘ఆర్య 2’ సినిమాలో సైడ్ రోల్ లో నటించినా ఫేమస్ అయింది శ్రద్ధా దాస్. ఇందులో ఆర్యను ప్రేమించే అమ్మాయిగా ఎంతో అందంగా కనిపించి యూత్ ను బాగా ఆకట్టుకుంది.

    ఆ తరువాత నాగవల్లి, డార్లింగ్ సినిమాల్లోనూ ప్రత్యేకంగా కనిపించి అలరించింద. అయితే మెయిన్ హీరోయిన్ గా మాత్రం అవకాశం దక్కలేదు. ఇదే సమయంలో కన్నడ, మలయాళ సినిమాల్లో శ్రద్ధాదాస్ కు పలు అవకాశాలు వచ్చాయి. కొన్ని హర్రర్ సినిమాల్లో శ్రద్ధా దాస్ మెయిన్ రోల్ చేశారు. చివరికి హిందీ సినిమాల్లోనూ శ్రద్ధా దాస్ కనిపించింది. ‘ఖాకీ’ సినిమాలో శ్రద్ధా దాస్ తన నటనతో ఆకట్టుకుంటుంది.

    ఇటీవలే ‘పారిజాత పర్వం’ అనే సినిమాలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ మూవీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అందచందాల ఫొటోలను పెట్టి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో శ్రద్ధా చేసే రచ్చ మాములుగా లేదు. పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాలను అరబోస్తూ ఉంటుంది. లేటేస్టుగా శ్రద్ధా దాస్ మిర్రర్ సెల్ఫీ దిగుతూ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇందులో శ్రద్ధా ఫేస్ కనిపించకపోయినా ఆమె దేహ అందాలు ఆకట్టుకుంటున్నాయి.

    కంప్లీట్ గా బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్న శ్రద్ధను చూసి కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు. దీంతో ఆమె ఫొటోలను ఉద్దేశించి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే శ్రద్ధా దాస్ మరికొన్ని సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె సోషల్ మీడియాలో ఇలా రచ్చ చేస్తోందని కొందరు కామెంట్ పెడుతున్నారు. కానీ శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. సందర్భాన్ని బట్టి అందమైన ఫొటోలను నెట్టింటా అప్ లోడ్ చేస్తోంది. దీంతో ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే పెరిగారు. ఇప్పటికైనా శ్రద్ధా దాస్ కు మంచి అవకాశాలు రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.