The Paradise : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. నిజానికి మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అంటూ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ మార్చి తర్వాత ఈ రిలీజ్ డేట్ ని పూర్తిగా మార్చేశారు. ఆగస్టు 21వ తేదీన ఈ సినిమా రాబోతుంది అంటూ మరో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సంవత్సరం ప్రకారం ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా రావడం లేదు. ఈ సినిమా కోసం అహర్నిశలు వెయిట్ చేస్తున్న అభిమానులు అలాగే ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళందరికి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు.
రిలీజ్ డేట్ ని తొందర్లోనే అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా రోజురోజుకీ సినిమా మీద ఉన్న అంచనాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి అంటూ మరి కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగైనా సరే ఈ సినిమాతో తనకంటూ ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.
నిజానికి శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరుపుతున్నాడు. ఇంతకు ముందు కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోవడం వల్ల ఈ సినిమాకి ఇంత లేట్ అయింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఊపందుకున్న ఈ సినిమాను తొందర్లోనే కంప్లీట్ చేసి దసర బరిలో నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
తను అనుకున్న టైం కి ఈ సినిమాని రిలీజ్ చేయగలుగుతారా? మరోసారి రిలీజ్ డేట్ ని మారిస్తే బాగుంటదనే ఉద్దేశ్యంతోనే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు. ఇక ఈ మధ్యలో ఏదైనా జరిగే అవకాశం ఉందా మొత్తానికైతే ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
