Ashwinidat- Student No. 1 Movie: టాలీవుడ్ లో ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం ఎన్నో సందర్భాలలో మనం చూసి ఉంటాము..ఎంతో మంది హీరోలు దురదుష్టపుశాతం వారి కెరీర్స్ లో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని మిస్ చేసుకున్నారు..అలాగే వాళ్ళు మిస్ చేసుకున్న సినిమాలు మరో హీరో చేసి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచినవి కూడా చాలానే ఉన్నాయి..ఇది ఇలా ఉండగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన కెరీర్ లో చోటు చేసుకున్న కొన్ని విషయాలను పంచుకున్నాడు..ఇక అసలు విషయానికి వస్తే ఈయన నిర్మాణం లో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిందో మన అందరికి తెలిసిందే..జూనియర్ ఎన్టీఆర్ కి హీరో గా ఇది మొట్టమొదటి సూపర్ హిట్..ఈ సినిమా ద్వారానే దర్శక ధీరుడు రాజమౌళి తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు..ఇప్పుడు రాజమౌళి గారు ఇండియా లోనే నెంబర్ 1 డైరెక్టర్ అనే విషయం మన అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమా ప్రారంభం అయ్యే ముందు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి..అవేమిటి అంటే స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయం లో సీనియర్ హీరో కృష్ణంరాజు గారు ప్రభాస్ ని లాంచ్ చేసే క్రమం లో చాలా స్టోరీలే విన్నాడట..ఆ క్రమం లోనే అశ్వినీదత్ మరియు రాఘవేంద్ర రావు గారు రాజమౌళి గారిని కృష్ణం రాజు గారికి పరిచయం చేయించి స్టూడెంట్ నెంబర్ 1 కథని వినిపించాడట..కృష్ణంరాజు గారికి కథ బాగా నచినప్పటికీ కూడా మొదటి సినిమా ఇంత క్లాస్ గా ఉంటె బాగోదు..ఇంకా ఎప్పుడైనా ఈ సినిమా చేద్దాం అని చెప్పాడట.
Also Read: Karthikeya 2: బాలీవుడ్ లో అమిర్ ఖాన్ సినిమాని దాటేసిన కార్తికేయ 2 ..ఇది మాములు ప్రభంజనం కాదు

ఆ తర్వాత కృష్ణంరాజు గారు ఎన్నో కథలు విన్నప్పటికి కూడా ఆయన సంతృప్తి చెందలేదు..దీనితో చివరికి అశ్వినీదత్ గారికి ఫోన్ మొన్న చెప్పిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా స్టోరీ ని తీసుకునిరా..కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రభాస్ తోనే ఈ సినిమాని తీద్దాం అని అడిగారట కృష్ణం రాజు గారు..కానీ అప్పటికే హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ తో ఈ కథ చెయ్యాలని అడిగేసరికి ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి ఆ సినిమా తీస్తున్నాము అండీ అని చెప్పారట అశ్విని దత్ గారు..దీనితో కృష్ణం రాజు గారు ‘అవునా!సరే పర్లేదు..బాగా తియ్యండి..ఆల్ ది బెస్ట్’ అని చెప్పి ఫోన్ పెట్టేశారట..అలా స్టూడెంట్ నెంబర్ సినిమా ఎన్టీఆర్ తో చెయ్యాల్సి వచ్చిందని అశ్వినీదత్ గారు ఈ సందర్భంగా తెలిపారు.
Also Read:Jr NTR In Oscar Race: ఆర్ఆర్ఆర్ దెబ్బకు.. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. అందులో ఏం విశేషం ఏంటంటే?