Karthikeya 2: కంటెంట్ బాగుంటే హీరో ఎవరు అనేది చూడకుండా ప్రేక్షుకులు సినిమాలను ఆదరిస్తారు..అద్భుతమైన వసూళ్లు ఇస్తారు అనడానికి నిదర్శనమే ఇటీవలే విడుదలైన కార్తికేయ 2 చిత్రం..నిఖిల్ హీరో గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మొదటి రోజు మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ ని సొంతం చేసుకుంది..టాక్ కి తగట్టే కలెక్షన్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి..ఎక్కడ చూసిన ఈ సినిమా టికెట్స్ కోసమే చర్చ..అంత డిమాండ్ గా మారిపోయింది ఈ సినిమా టిక్కెట్లు..ఈ సినిమాకి మన టాలీవుడ్ లో కొంతమంది బడా నిర్మాతలు ఎలాంటి బెదిరింపులు చేసారో మన అందరికి తెలిసిందే..వాళ్ళ సినిమాలు విడుదల అవుతుండడంతో ‘మీ సినిమాని వాయిదా వేసుకోండి..లేదంటే మీకు థియేటర్స్ రానివ్వకుండా’ చేస్తామంటూ బెదిరింపులు చేసారని హీరో నిఖిల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి..అలాంటి ఒత్తిడుల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు వసూళ్ల సునామి సృష్టించడం చూస్తుంటే మంచి సినిమాని దేవుడు దిగి వచ్చిన తొక్కలేడు అనే విషయం అర్థం అవుతుంది.

తెలుగు ప్రేక్షకులు సినిమా బాగుంటే ఆదరించకుండా ఉండరు అనే విషయం మనకి తెలుసు..కానీ ఈమధ్య కాలం లో బాలీవుడ్ ప్రేక్షుకులు కూడా కంటెంట్ బాగుంటే ఆ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు..దానికి ఉదాహరణగా గత నెలలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాని తీసుకోవచ్చు..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించి వంద కోట్ల రూపాయిలను వసూలు చేసింది..ఇప్పుడు కార్తికేయ 2 కూడా బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది..రివ్యూస్ మరియు మౌత్ టాక్ అద్భుతంగా రావడం తో నిన్న ఈవెనింగ్ షోస్ నుండి హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం మొదలెట్టాయి..ఇటీవలే బాలీవుడ్ బడా హీరోలైన అమిర్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ లు హీరోలు గా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ,’రక్షాబంధన్’ వంటి సినిమాలు విడుదలయ్యాయి.
Also Read: Jr NTR In Oscar Race: ఆర్ఆర్ఆర్ దెబ్బకు.. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. అందులో ఏం విశేషం ఏంటంటే?

ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి..నిన్న కార్తికేయ 2 చిత్రం హిందీ వెర్షన్ ఈ రెండు సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోయారు..అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ సినిమాకి హిందీ వెర్షన్ షోస్ పెంచాల్సిందిగా దర్శక నిర్మాతలు వత్తిడి చేస్తున్నారు..కానీ వారం వరుకు విడుదలైన రెండు బాలీవుడ్ బడా చిత్రాలకు థియేటర్స్ అగ్రిమెంట్ జరిగిపోవడం తో ఆగష్టు 19 వ తారీకు వరుకు థియేటర్స్ దొరికే పరిస్థితి కనిపించడం లేదట..మరి థియేటర్స్ భారీ సంఖ్యలో పెరిగిన తర్వాత ఈ సినిమా హిందీ లో ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది చూడాలి.
Also Read: Mahesh-Trivikram Movie: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా ప్రముఖ స్టార్ హీరో..షాక్ లో ఫాన్స్
[…] Also Read: Karthikeya 2: బాలీవుడ్ లో అమిర్ ఖాన్ సినిమాని … […]
[…] Also Read: Karthikeya 2: బాలీవుడ్ లో అమిర్ ఖాన్ సినిమాని … […]