https://oktelugu.com/

Health Tips : డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నానబెట్టి తినాలా? పాలలో నానబెట్టి తినాలా? ఏది మంచిది?

డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు అందుతాయి. మరి ఈ డ్రై ఫ్రూట్స్ ను పాలలో నానబెట్టి తినడం, నీళ్లలో నానబెట్టి మరీ తింటుంటారు. ఇందులో ఏది బెటర్?..

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 25, 2024 / 06:10 PM IST
    Follow us on

    Health Tips : డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మంచిది. ఒకసారి డ్రై ఫ్రూట్స్ తినడం అలవాటు అయితే ఎవరైనా సరే వాటికి ఫ్యాన్ అవ్వాల్సిందే. ఇక ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఇతర సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ను ఎవరైనా తినడానికి ఇష్టపడతారు. టేస్ట్ తో పాటు పోషకాలు మరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ డ్రై ఫ్రూట్స్ తో బోలెడు ప్రయోజనాలు ఉంటాయండోయ్. అయితే కొందరు వీటిని నానబెట్టి తింటే మరికొందరు అలాగే పచ్చిగా తింటారు. కానీ వీటిని నానబెట్టి తింటే మాత్రం త్వరగా జీర్ణం అవుతాయి. నానబెట్టి తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ లోని పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంటుంది. మరి ఈ డ్రై ఫ్రూట్స్ ను నీళ్లలో నానబెట్టి తినాలా? లేదా పాలలో తినాలా అనే విషయం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే ఇవి కాస్త పెద్దగా మారుతాయి. అదేనండి ఉబ్బడం అంటారు కదా. విత్తనాలు, మొలకలు ఏవైనా సరే నానబెట్టడం వల్ల అవి కాస్త ఉబ్బుతాయి. ఇక ఇవి మృదువుగా మారి , సులభంగా నమలడానికి వీలుగా ఉంటుంది. వీటిని సలాడ్స్, డెజర్ట్ వంటి ఫుడ్ ఐటమ్స్ లో సులభంగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తినడం వల్ల పోషకాలన్నీ శరీరానికి యూజ్ అవుతాయి. ఇక దంత సమస్యలు జీర్ణం సంబంధ సమస్యలు ఉన్నవారు గట్టిగా ఉండే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తినడమే మంచిది అంటున్నారు నిపుణులు.

    డ్రై ఫ్రూట్స్ ను నీటిలో కానీ పాలలో కానీ రెండింటిలో సరే నానబెట్టి తినడం బెటర్ అంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తింటే ఇవి హైడ్రేట్ గా మారుతుంటాయి. అంతేకాదు సహజ రుచులు మరింత పెరుగుతాయి కూడా. నీటిలో తినడం ఒకటి అయితే పాలలో నానబెట్టి తినడం మరో విషయం. అయితే పాలలో అదనపు కేలరీలు ఉంటాయి. ఇందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. పాలలో ఉండే కేలరీలు మీకు వద్దు అనుకుంటే మాత్రం మీరు నీటిలో నానబెట్టి తినాలి. లేదంటే వీటిని పాలలో నానబెట్టి తినడం మంచిది అంటున్నారు నిపుణులు

    డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నానబెట్టడం వల్ల సహజ చక్కెరలు, ఫైబర్ కంటెంట్ కు అదనపు కేలరీలు లేదా కొవ్వులు యాడ్ కావట. కేలరీస్ డైట్ ఫాలో అయ్యేవారు, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ పద్దతిని ఉపయోగించడం చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ను పాలలో నానబెడితే కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి. వీటికి క్రీమ్ ప్రత్యేక ఆకృతిని అందిస్తుంది. రుచిని కూడా అందిస్తుంది. అందుకే కొన్ని వంటకాలలో వీటినే ఫాలో అవుతుంటారు. మరో విషయం ఏంటంటే.. పాలలో నానబెడితే డ్రై ఫ్రూట్స్ రుచి పెరగడమే కాల్షియం, విటమిన్ వంటి పోషకాలు కూడా మీకు లభిస్తాయి.

    డెయిరీ ప్రొడక్స్ట్ తినడం ఇష్టం లేకపోయినా లేదంటే మీరు డెయిరీ ప్రొడక్ట్స్ ను అసలు తినకున్నా సరే శరీరంలో ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవాలి అంటే పాలలో డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తినండి. దీని వల్ల మీకు మరింత ప్రయోజనాలు చేకూరుతాయి. ఇందులో లభించే కాల్షియం, ప్రొటీన్ ల వల్ల ఎముకల ఆరోగ్యానికి, కండరాల నిర్మాణానికి చాలా అవసరం. కొందరికి డ్రై ఫ్రూట్స్ వల్ల జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా లాక్టోజ్ అలర్జీ ఉంటే డ్రై ఫ్రూట్స్ నీళ్లలో మాత్రమే నానబెట్టి తినాలి.

    పాలలో నానబెట్టి తినే డ్రై ఫ్రూట్ తో పోలిస్తే నీళ్లలో నానబెట్టి తినే డ్రై ఫ్రూట్స్ త్వరగా జీర్ణం అవుతాయి. అంతేకాదు పొట్ట అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంటాయి ఈ డ్రై ఫ్రూట్స్. గుండె సమస్యలు, షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం వీటిని తినే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ డాక్టర్ ను సంప్రదించండి.