https://oktelugu.com/

Rythu Bharosa : వ్యవసాయం చేసే వారికే పెట్టుబడి సాయమా..?

Rythu Bharosa ప్రభుత్వం ఫైనల్ గా ఏ విధంగా పెట్టుబడి సాయం అందిస్తుందో కొద్ది రోజులు వెయిట్ చేస్తే మాత్రం తెలుస్తుంది.. చూద్దాం ఏం జరుగుతుందో మరి..?

Written By:
  • NARESH
  • , Updated On : June 27, 2024 / 04:53 PM IST

    Rythu Bharosa

    Follow us on

    అందుకోసమేనా ఆ సర్వేనా..
    ఐదు జిల్లాలు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక
    వ్యవసాయ భూముల లెక్క తేలుతుందనేనా.. ?
    రెండు మార్గాలుగా అన్వేషణ ప్రక్రియ..
    ఎందుకీలా జరుగుతుంది..? అసలు వివరాలు ఏంటి..?

    Rythu Bharosa : వ్యవసాయం చేసే భూములకే సర్కారు రైతు భరోసా అందించనుందా.. వ్యవసాయం చేయని వారికి అందించవద్దని నిర్ణయించిందా.. ఆ సర్వే తో పాటు రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడంతోనే అసలు విషయం తెలుస్తున్నది. మొత్తానికి వ్యవసాయం చేసే రైతులకు రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతున్నది. ల్యాండ్ యూటిలైజేషన్ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐదు జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఇందులో కరీంనగర్ తో పాటు మిగతా నాలుగు జిల్లాలను ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ యుటీలైజేషన్ సర్వే ప్రారంభమైంది. సిబ్బంది గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేస్తున్నారా.. లేదా.. వ్యవసాయ భూముల్లో ప్లాటింగ్ చేశారా.. రియల్ వ్యాపారం చేస్తున్నారా.. భూములు ఖాళీగా ఉన్నాయా.. బావులు ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా.. ఇంకా ఏమో ఉన్నాయి.. అన్నివివరాలు సమగ్రంగా సేకరిస్తున్నారు.

    ఈ సర్వే వల్ల వ్యవసాయం చేసే రైతుల సమాచారం తెలిసిపోతుంది. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. అక్కడ వివరాలు సేకరించి ఫోటోలు తీసి యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఈ సర్వే ఒక మార్గం. దీనిపైన ఆధారపడకుండా సర్కారు మరో మార్గం ఎంచుకున్నట్టు స్పష్టమవు తున్నది. ఎందుకంటే నెపం ప్రభుత్వంపై పడకుండా జాగ్రత్త పడుతున్నది. రైతుల నుంచి ఈ పథకం అమలు సందర్భంగా వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. ఒక వైపు రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసాను అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోమవారం రోజున వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు వేదికల వారీగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. కొంతమంది రైతులు మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రైతుబంధు పథకం అమలు తీరుపై పలు సూచనలు చేశారు. ఎక్కువ శాతం మంది రైతులు 10 ఎకరాల వరకు రైతు భరోసా సాయం అందజేయాలని విన్నవించారు. దీంతోపాటు ఐటీకి సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించి తీరాలని కోరారు.

    గత ప్రభుత్వం లాగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. గుట్టలు, చెట్లు, బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, వృధాగా ఉన్న భూములకు రైతు భరోసా సాయన్ని అందించవద్దని కోరారు. అయితే ప్రభుత్వం రెండు మార్గాల్లో రైతు భరోసా పథకంపై అన్వేషణ చేస్తున్నది. ఏ పద్ధతిలో అందిస్తే చేస్తే బాగుంటుంది అనే దానిపై ఆలోచన చేస్తున్నది. ఒకవైపు ల్యాండ్ యుటీలైజేషన్ సర్వే.. మరోవైపు రైతుల అభిప్రాయాలు సేకరించడం.. వాటిని క్రోడీకరించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించే అవకాశం ఉందని తెలుస్తున్నది.. ప్రభుత్వం ఫైనల్ గా ఏ విధంగా పెట్టుబడి సాయం అందిస్తుందో కొద్ది రోజులు వెయిట్ చేస్తే మాత్రం తెలుస్తుంది.. చూద్దాం ఏం జరుగుతుందో మరి..?