https://oktelugu.com/

Balakrishna: బాలయ్యకు చుక్కలు చూపిస్తున్న ఇద్దరు కూతుళ్లు… మోక్షజ్ఞ నే కారణం!

చిన్న కుమార్తె తేజస్విని ఆల్రెడీ రంగంలోకి దిగారని సమాచారం. బాలకృష్ణ-బోయపాటి శ్రీను చేస్తున్న ప్రాజెక్ట్ లో తేజస్విని నిర్మాణ భాగస్వామి అని ప్రచారం జరుగుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 30, 2024 / 02:24 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: హీరో బాలకృష్ణకు కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని చుక్కలు చూపిస్తున్నారట. అందుకు కారణం కొడుకు మోక్షజ్ఞనే నట. ఆ కథేమిటో చూద్దాం. బాలయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు ఒక అబ్బాయి. నందమూరి ఫ్యామిలీ సిద్ధాంతం ప్రకారం అమ్మాయిలు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండాలి. ఎన్టీఆర్ కూతుళ్లు కానీ, మనవరాళ్లు కానీ నటించలేదు. కనీసం నిర్మాణం, దర్శకత్వం వైపు రాలేదు. ఎన్టీఆర్ కుమారులు, మనవళ్లు మాత్రమే హీరోలు, నిర్మాతలుగా రాణించారు. రాణిస్తున్నారు.

    కాలం మారింది. ఆలోచనా విధానం మారింది. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ హీరోల కూతుళ్లు హీరోయిన్స్ కావడం మనం చూడొచ్చు. నాగబాబు కుమార్తె నిహారిక, రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక, అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య హీరోయిన్స్ గా చిత్రాలు చేశారు. కాగా బాలకృష్ణ కుమార్తెలు కూడా టాలీవుడ్ లో అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారట. వారు నిర్మాతలుగా కొనసాగాలని భావిస్తున్నారట.

    చిన్న కుమార్తె తేజస్విని ఆల్రెడీ రంగంలోకి దిగారని సమాచారం. బాలకృష్ణ-బోయపాటి శ్రీను చేస్తున్న ప్రాజెక్ట్ లో తేజస్విని నిర్మాణ భాగస్వామి అని ప్రచారం జరుగుతుంది. ఇక బ్రాహ్మణి సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్. ఆమె పలు వ్యాపారాల్లో సత్తా చాటుతుంది. కాగా బ్రాహ్మణి చూపు కూడా చిత్ర నిర్మాణం మీద పడిందట. ఈ క్రమంలో మోక్షజ్ఞను లాంచ్ చేసే విషయంలో పోటీ పడుతున్నారట.

    బాలకృష్ణ చాలా కాలంగా వారసుడు బాలకృష్ణను హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టకేలకు ఆయన ప్రయత్నాలు కార్యరూపం దాల్చాయట. ఈ ఏడాది మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అట. దర్శకుడు పూరి జగన్నాథ్ తో పాటు మరికొందరు దర్శకులను బాలకృష్ణ సంప్రదిస్తున్నారట. కథ కూడా సిద్ధంగా ఉందట. ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు బ్రాహ్మణి, తేజస్విని పోటీపడుతున్నారట. ఇద్దరు కూతుళ్ళ మధ్య బాలయ్య నలిగిపోతున్నాడట. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ బాలయ్యకు తలనొప్పిగా మారిందట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.