Kannappa: కన్నప్ప మూవీ లో ఒక ఫైట్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..?

మంచు విష్ణు ఈ సినిమాలోని ఒక ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసమే అంత డబ్బులు ఎందుకు పెడుతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Written By: Gopi, Updated On : June 23, 2024 6:15 pm

Kannappa

Follow us on

Kannappa: మోహన్ బాబు తనయుడిగా మంచి విష్ణు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్లాప్ అవుతూ వచ్చాయి. ఇక శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేసిన ఢీ సినిమా మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ తర్వాత ఆయన సక్సెస్ లను కంటిన్యూ చేయలేకపోయాడు. దేనికైనా రెఢీ, దూసుకెళ్తా లాంటి సినిమాలు యావరేజ్ గా ఆడినప్పటికి ఆయన రేంజ్ కు సరిపడా హిట్ అయితే దక్కలేదు.

ఇక దాంతో వరుస సినిమాలు చేసిన కూడా ఒక్క హిట్టు రాకపోవడం తో విసిగిపోయిన ఆయన ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఇక దీనికి గల కారణం ఏంటి అంటే ఇది తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన హీరోగా నిలబడతాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పెట్టిన బడ్జెట్ ను రికవరీ చేసుకోవడానికి అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కన్నడ రాజ్ కుమార్, ప్రభాస్ లాంటి స్టార్ నటులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే మంచు విష్ణు ఈ సినిమాలోని ఒక ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసమే అంత డబ్బులు ఎందుకు పెడుతున్నాడు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆ ఫైట్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ గా మారబోతుందట. అందువల్ల ఈ సినిమాని ఆయన చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక దాంతో పాటుగా పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక తద్వారా తను తీయబోయే సినిమాలకు మంచి హైప్ ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…