https://oktelugu.com/

Anasuya Bharadwaj: ఒంటిపై దుస్తులు విప్పుతూ.. శేఖర్ మాస్టర్ తో అనసూయ అరాచకం

అనసూయ ఖిలాడీ భామలకు లీడర్. కిర్రాక్ బాయ్స్‌కి శేఖర్ మాస్టర్ లీడర్‌. ఈ గేమ్‌లో గెలిచిన టీంకి రూ.20 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే అమ్మాయిల పక్కన అనసూయ ఉన్నంత వరకు వారిని ఎవరు ఓడించరు అంటూ సవాల్ విసిరింది అనసూయ.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 23, 2024 / 06:01 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj: స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘నీతోనే డాన్స్ 2.0 ఫినాలే ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఇక ఈ షో కంప్లీట్ అవడంతో మరో కొత్త ప్రోగ్రామ్ ను ప్రేక్షకుల ముందకు తీసుకొని రాబోతున్నారు మేకర్స్. అదే
    కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్. ఈ గేమ్ షో జూన్ 29 నుంచి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ గేమ్ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో పేరుకు తగ్గట్టే ఖిలాడీ లేడీలను దింపారు మేకర్స్.

    అనసూయ ఖిలాడీ భామలకు లీడర్. కిర్రాక్ బాయ్స్‌కి శేఖర్ మాస్టర్ లీడర్‌. ఈ గేమ్‌లో గెలిచిన టీంకి రూ.20 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే అమ్మాయిల పక్కన అనసూయ ఉన్నంత వరకు వారిని ఎవరు ఓడించరు అంటూ సవాల్ విసిరింది అనసూయ. ఇందులో అనసూయ గెటప్ మామూలుగా లేదనే చెప్పాలి. ఇక షోలకు యాంకర్ గా ఉండాలంటే శ్రీముఖినే అనే రేంజ్ లో పేరు సంపాదించింది. ఈ బ్యూటీనే ఈ షోకు యాంకర్.

    రెండు టీమ్స్‌లోనూ బిగ్ బాస్ అగ్రిమెంట్‌‌లో ఉన్న వారే. ఎలాగూ రెండుమూడేళ్లు బిగ్ బాస్ షోలోనే చేయాలని అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి.. ఆ సీజన్ 8 చిరాకు తెప్పించిన వాళ్లనే కంటెస్టెంట్స్‌గా పెట్టారు. ఇందులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ లేరు. అతనొస్తే ఇక్కడ కూడా రైతు సింపథీ డ్రామాలతో రూ.20 లక్షల్ని ఎగరేసుకొని పోతాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. అయితే ఇందులో అమర్ దీప్, అర్జున్ అంబటి, టేస్టీ తేజాలు ఉన్నారు.. ఇక అమ్మాయిల్లో.. బిగ్ బాస్ సీజన్ 8 ఖతర్నాక్‌లు శోభాశెట్టి, ప్రియాంక జైన్‌లు ఉన్నారు.

    మధ్యలో మధ్యలో ముద్దులు.. రొమాన్స్‌లు అంటూ బిగ్ బాస్ ను మించేలానే ఉంటుంది అనేట్టుగా ఉంది. ఇక చివరల ఏం టాస్క్ ఇచ్చారో కానీ.. అటు శేఖర్ మాస్టర్ షర్ట్ విప్పుతుంటే.. ఇటు అనసూయ తన టాప్‌ని విప్పుతూ సై సై అంటోంది. వీళ్లిద్దరిని చూస్తూ పక్కనుంచి శ్రీముఖి అరుపులు.. కంటెస్టెంట్స్ గోలలు.. మొత్తం మీద స్టార్ మా మామూలుగా ప్లాన్ చేయలేదు. ప్రోమోనే ఇలా ఉంటే ఇక షో ఎలా ఉంటుందో చూడాల్సిందే..