https://oktelugu.com/

Anirudh Ravichander: రజినీకాంత్ కి ధనుష్ అల్లుడు అవుతాడు..? మరి అనిరుధ్ ఏం అవుతాడు..?

ప్రస్తుతం యువ సంచలనం గా పేరు తెచ్చుకుని మ్యూజిక్ రంగం లో దూసుకుపోతున్న ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్...హీరో ఎవరైనా సరే మ్యూజిక్ మాత్రం తనే ఇస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 10:12 AM IST

    Anirudh Ravichander

    Follow us on

    Anirudh Ravichander: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని సూపర్ స్టార్ గా ఎదిగిన ఒకే ఒక హీరో రజనీకాంత్…బస్ కండక్టర్ గా తను కెరియర్ ను స్టార్ట్ చేసిన రజినీకాంత్ సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత విలన్ గా మారాడు. ఆ సమయం లో మంచి నటుడుగా గుర్తింపు పొందాడు. ఇక ఆ తర్వాత హీరోగా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీ లో ‘సూపర్ స్టార్ ‘ గా ఎదిగాడు. ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోల్లో రజనీకాంత్ ఒకరు. ఇక ప్రస్తుతం ఆయనకి 70 సంవత్సరాల పైన వయస్సు ఉన్న కూడా ఇప్పటికీ ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారంటే ఆయన సినిమాలకి ఇండియాలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. గత సంవత్సరం వచ్చిన ‘జైలర్ ‘ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో రజనీకాంత్ పేరు మారుమ్రోగిపోయేలా చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి ఆయన తన స్టార్ డమ్ ను విస్తరించుకున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఇప్పటివరకు ఏ సీనియర్ హీరోకి సాధ్యం కానీ రీతిలో భారీ వసూళ్లను సాధించాడు. ఇక రజినీకాంత్ చేసిన సినిమాల్లో ఇప్పుడు వస్తున్న చాలా సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఇక అనిరుధ్ ను సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చింది ధనుష్ అనే విషయం మనకు తెలిసిందే.

    ఇక ధనుష్ రజనీకాంత్ అల్లుడు కాబట్టి ఆయన హీరో గా మారినప్పటికీ ఆయన టాలెంట్ తో మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక రజనీకాంత్ కూతురు అయిన ఐశ్వర్య రజినీకాంత్ ను ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గా వీళ్ళు విడాకులు తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనప్పటికీ ధనుష్ మాత్రం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే అనిరుధ్ ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ధనుష్ కి కృతజ్ఞత గా అనిరుధ్ చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చి ధనుష్ సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడం లో చాలా వరకు హెల్ప్ చేశాడు.

    ఇక అందులో భాగంగానే మొదట్లో వరుసగా ధనుష్ సినిమాలు చేసిన అనిరుధ్ ఆ సినిమాలతో తనను తాను ప్రూవ్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు… ఇక నిజానికి అనిరుధ్ కూడా రజనీకాంత్ కి రిలేషన్ అనే విషయం మనలో చాలామందికి తెలియదు. అయితే రజనీకాంత్ కి అనిరుధ్ అల్లుడు అవుతాడు.అది ఎలా అంటే రజినీకాంత్ వాళ్ళ భార్య అయిన లత వాళ్ల అన్నయ్య కొడుకే అనిరుధ్… అంటే రజినీకాంత్ వాళ్ల బామ్మర్ది కొడుకు కాబట్టి రజనీకాంత్ కి అల్లుడు అవుతాడు. ఇక ధనుష్ కు మాత్రం బ్రదర్ అవుతాడనే చెప్పాలి…

    ఇక మొత్తానికైతే రజినీకాంత్ ఫ్యామిలీ నుంచి అనిరుధ్ రావడం ఒకెత్తు అయితే, ఆయన ప్రస్తుతం టాప్ హీరోలందరికీ మ్యూజిక్ ని అందిస్తూ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్ళడం మరొక ఎత్తు అనే చెప్పాలి…ఇంకా ఇప్పుడు ఆయన చేతిలో చాలా సినిమాలు ఉండడమే కాకుండా ప్రతి సినిమాలో కూడా తన మార్క్ మ్యూజిక్ ను చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు…