https://oktelugu.com/

Chiranjeevi And Kamal Haasan: కమల్ హాసన్ కోసం రాసుకున్న ఒక ఆర్ట్ సినిమాలోకి చిరంజీవి ఎలా వచ్చాడు…

ఇండియాలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఇప్పటికీ ఆ సినిమాను చూడటానికి చాలా మంది జనాలు ఆసక్తిగా ఎదురు చేస్తూ ఉంటారు. ఇక ఆయన యాక్టింగ్ వేరే లెవల్లో ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : July 24, 2024 / 10:18 AM IST

    Chiranjeevi And Kamal Haasan

    Follow us on

    Chiranjeevi And Kamal Haasan: సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం రాసుకున్న కథలోకి మరొక హీరో వచ్చి చేరడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వాటి వల్లే కొంతమంది స్టార్ హీరోలుగా మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే చాలా మంది స్టార్ హీరోలు వాళ్ల సినిమాలను వదిలేయడం వల్ల మీడియం రేంజ్ హీరోలు ఆ సినిమాలను చేసి స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి సమయంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ చేయాల్సిన ఒక సూపర్ హిట్ సినిమాని చిరంజీవి చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి ఒకానొక సమయంలో కమల్ హాసన్ అంటే క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇక ఆర్ట్ సినిమాలను చేయడంలో తనన మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక కే విశ్వనాధ్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ‘సాగర సంగమం’ సినిమా కథ విన్నాక అందులో ముసలి గెటప్ ఉందని కమల్ హాసన్ ఆ సినిమా చేయనని చెప్పాడట. దాంతో ఆ సినిమా వేరే వాళ్ళతో చేయలేను అంటూ విశ్వనాధ్ గారు ఆ స్క్రిప్ట్ ను పక్కకు పడేసారట. ఇక ఈ సినిమాను చేస్తే కమల్ హాసన్ లాంటి డెడికేషన్ ఉన్న నటుడితో మాత్రమే చేయగలను లేకపోతే చేయలేను. అంటూ కె విశ్వనాథ్ అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు కమల్ హాసన్ ఎలాంటి నటుడో…ఇక అలాంటి కమల్ హాసన్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు.

    ఇక ఆ క్యారెక్టర్లను పోషించి కమల్ హాసన్ చాలా ప్రశంసలను కూడా అందుకున్నాడనే చెప్పాలి. మరి ఇలాంటి సమయంలో ఒక ఆర్ట్ సినిమాలోకి కమల్ హాసన్ ను కాదని చిరంజీవి వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించాడు…అది ఏ సినిమా అంటే బాలచందర్ డైరెక్షన్ లో చిరంజీవి చేసిన ‘రుద్రవీణ ‘ సినిమా… ఈ మూవీ లో చిరంజీవి ఒక సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించాడు. అప్పటివరకు మొత్తం మాస్ సినిమాలను చేసిన చిరంజీవి ఒక్కసారిగా సాఫ్ట్ క్యారెక్టర్ లో నటించి ఒక పెద్ద సాహసం చేశాడనే చెప్పాలి.

    అయితే చిరంజీవి మాత్రం ఇలాంటి ఒక సినిమా చేయాలని బాలచందర్ తో చెప్పాడట..ఇక అప్పటికే కమల్ హాసన్ తో రుద్రవీణ సినిమా చేయాలనుకున్న బాలచందర్.. కమలహాసన్ ఇప్పటివరకు ఇలాంటి పాత్రలని చాలా చేశాడు. ఇక ఆయనతో చేస్తే వైవిధ్యం ఏముంటుంది.
    ఒక మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేసి సక్సెస్ కొట్టినప్పుడే కదా మనలో ఉన్న దర్శకుడు కూడా సాటి స్ఫై అయ్యేది అనే ఉద్దేశ్యం తోనే కమల్ హాసన్ ను పక్కనపెట్టి చిరంజీవితో ఈ సినిమా చేశాడు. అయితే ఈ సినిమాకి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అయితే దక్కాయి. కానీ సినిమా కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ అయితే సాధించలేదు.

    ఇక ఈ సినిమాకి బెస్ట్ ఫిలిం గా ‘నేషనల్ అవార్డు’ కూడా వచ్చింది. ఇక మొత్తానికైతే చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో ఒక క్లాస్ సినిమా చేసి మంచి గుర్తింపు సంపాదించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక మొత్తానికైతే చిరంజీవి, బాల చందర్ తో కలిసి కమల్ హాసన్ కి భారీ షాకిచ్చారనే చెప్పాలి..