Homeఎంటర్టైన్మెంట్Catherine Tresa: సీనియర్ హీరోలకు మరో కుర్ర హీరోయిన్ ...

Catherine Tresa: సీనియర్ హీరోలకు మరో కుర్ర హీరోయిన్ దొరికిందోచ్ !

Catherine Tresa: కేథ‌రిన్ థ్రెసాకి 33 ఏళ్ళు. ఇంకా పెళ్లి కాలేదు. ఆమె యంగ్ హీరోయినే అని ఇన్నాళ్లు ఫీల్ అవుతూ వచ్చింది. కానీ మేకర్స్ అలా ఫీల్ అవ్వడం లేదు. దాంతో ఇక ‘సీనియర్’ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది కేథ‌రిన్. ఎలాగూ కుర్ర హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదు కాబట్టి.. చిన్నగా 60 ఏళ్లు పైబడిన హీరోలతో జతకడుతోంది కేథ‌రిన్.

Catherine Tresa
Catherine Tresa

కేథ‌రిన్ థ్రెసా వరుసగా రెండు పెద్ద సినిమాల్లో సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించబోతుంది. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న సినిమాలో కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్ గా నటించనుంది. ఇంతకుముందు నయనతార, కాజల్ తో జతకట్టేందుకు సీనియర్ హీరోలు ఆసక్తి చూపేవారు. కానీ, ఇప్పుడు ఆ లీగ్ లో తమన్నా, శృతి హాసన్ చేరారు.

Also Read: Koratala Siva- NTR Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మే 20న ఇక రచ్చ రచ్చే !

ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా చేస్తున్న సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా కేథ‌రిన్ థ్రెసాను ఫైనల్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ, బాలయ్యకి జోడి శృతి హాసన్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది అని ఆమెను ఖరారు చేశారు. మొత్తమ్మీద అనిల్ రావిపూడి కేథ‌రిన్ కు బాలయ్య సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

అలాగే, కేథ‌రిన్ థ్రెసాకి మరో భారీ సినిమా వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రంలో కేథ‌రిన్ థ్రెసాను హీరోయిన్ గా పెట్టుకుంటున్నారు. మొదట నయనతారను అనుకున్నా.. ఆమె పారితోషికం భారీగా ఉంది. సో, మిగిలిన 30 ప్లస్ హీరోయిన్ లు కంటే కేథ‌రిన్ థ్రెసా బెటర్ అనిపించింది.

Catherine Tresa
Catherine Tresa

మొత్తానికి అందరిలో కల్లా శృతి హాసన్ కొంచెం తెలివిగా సీనియర్ హీరోల సరసన నటించేందుకు ప్రీమియం రేట్ అడుగుతూ ముందుకు పోతుంది. ఇక ఆమె వదులుకున్న సినిమాలన్నీ కేథ‌రిన్ థ్రెసా దగ్గరకు వస్తున్నాయి. ఎలాగూ కేథ‌రిన్ థ్రెసా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు కాబట్టి.. వచ్చిన సినిమాలు చేసుకుంటూ పోతుంది.

Also Read:Mahesh Babu: మహేశ్ బాబుకు నచ్చని ఆయన సినిమా ఏంటో తెలుసా?

Recommended Videos:

Samantha New Look Go Crazy For Fans || Shakuntalam Movie ||  Oktelugu Entertainment

Hero Nikhil Father Shyam siddarth Passes Away || Actor Nikhil || Oktelugu Entertainment

Chiranjeevi Dream To See Tollywood Equally With Bollywood || Oktelugu Entertainment

Acharya Movie Review || Chiranjeevi || Ram Charan || Koratala Siva || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version