Koratala Siva- NTR Movie: కూల్ అండ్ క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ – ఎన్టీఆర్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఐతే.. ప్రస్తుతం ఆచార్య చిత్ర ప్రచారంలో ఉన్న కొరటాల శివ, మరో వారంలో ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రంపై ఫోకస్ పెట్టనున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి అప్‌డేట్ ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న ఉండనున్నట్టు తెలిపారు.

అలాగే ఈ ఏడాదిలో చిత్రీకరణను పూర్తి చేసి.. వచ్చే ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజునే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని కొరటాల తెలిపారు. మొదట హీరోయిన్‌గా అలియా భట్ అనుకోగా ఇంకా కన్ఫర్మ్ కాలేదన్నారు. రణబీర్ కపూర్ ను పెళ్ళి చేసుకున్న ఆలియా.. తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలి అంటే.. సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఆమె నిర్ణయం తీసుకుందని టాక్ నడిచింది.
Also Read: Analysis on YCP vs Janasena : జనసేనతో పెట్టుకుంటే అంతేమరీ
మొత్తానికి ఎన్టీఆర్ సినిమాలో అలియా లేనట్టే. అందుకే, ఆలియా భట్ ప్లేస్ లో క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకున్నారని పుకార్లు పుట్టించారు. ప్రస్తుతం కొరటాల ఆచార్య సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ పై కొరటాల క్లారిటీ ఇచ్చాడు.
కొరటాల ఏమి చెప్పాడు అంటే.. ‘నేను స్క్రిప్ట్ ని కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే చెప్పాను. నేను ఇంకా ఏ హీరోయిన్ కి కథ చెప్పలేదు. అలాగే ఈ సినిమా కోసం ఏ హీరోయిన్ని ఫైనలైజ్ చేయలేదు అని కొరటాల చెప్పుకొచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు లో రష్మిక నటిస్తోంది అని వస్తున్న పుకార్లలో అసలు వాస్తవం లేదు అని తేలిపోయింది.

కాకపోతే, క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నాను తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది రష్మిక. అందుకే, ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి.
గతంలో ఎప్పుడూ లేని విధంగా దర్శకుడు కొరటాల ఈ చిత్రాన్ని సరికొత్త యాక్షన్ విజువల్ ట్రీట్ గా మలచబోతున్నాడు. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Also Read: Mahesh Babu: మహేశ్ బాబుకు నచ్చని ఆయన సినిమా ఏంటో తెలుసా?
Recommended Videos:




[…] […]
[…] […]
[…] Chiranjeevi-Balakrishna: తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి, బాలకృష్ణ రెండు కళ్లలాంటి వారు. తమదైన శైలిలో చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను రంజింపచేయడంలో ముందుంటారు. రెండు భిన్న ధృవాలైనా ఇండస్ట్రీకి వారే పెద్దదిక్కు. అందుకే వారి చిత్రాల కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి వచ్చిందంటే సందడే. చిరు, బాలయ్య అభిమానుల ఆశలకు అంతే ఉండదు. తమ ప్రియతమ కథానాయకుల కోసం వారి అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. చిత్ర విజయంలో కీలక పాత్ర పోషిస్తుంటారు. తమ అభిమాన హీరోల చిత్రాలను అపురూపంగా చూస్తారు. అందుకే సంక్రాంతి బరిలో వీరి చిత్రాలు బాక్సాఫీసు బొనాంజాగా నిలవడం ఖాయం. […]
[…] Zee Telugu Saregamapa 2022: సరిగమప షో కొత్త పుంతలు తొక్కింది. తెలుగు రాష్ట్రాలు, దేశ, విదేశీ మూలల నుంచి వచ్చిన ఎంతో మంది పేద, సామాన్య కళాకారులు వచ్చి ఈ షోలో తమ సత్తా చాటుతున్నారు. వారి గాన మాధుర్యాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. పేదింటి ఆడకూతురు పార్వతి, ఇక భర్తకు దూరమైన కళ్యాణి ఇలా.. ఎంతో మంది పాటలే ప్రాణంగా ఈ స్టేజీపై అదరగొట్టారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నారు. ఇటీవలే పార్వతి, కళ్యాణి , కీర్తనలు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ఇక గెస్ట్ సింగర్స్ కొందరు అద్భుతంగా పాడి అలరించారు.తాజాగా వచ్చే ఆదివారానికి సంబంధించిన ‘సరిగమప షో’ ప్రోమో విడుదలైంది.ఇదిప్పుడు వైరల్ గా మారింది. […]