https://oktelugu.com/

Bigg Boss Manas: బిగ్ బాస్ ఫేమ్ మానస్ హీరోగా 5జీ లవ్ మూవీ…

Bigg Boss Manas: ‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. ఒక వైపు బిగ్ బాస్ లో తనదైన శైలిలో దూసుకుపోతు టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి ఇప్పుడు హీరోగా, విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. అతి త్వరలోనే బిగ్ బాస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దాంతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 06:50 PM IST
    Follow us on

    Bigg Boss Manas: ‘బిగ్ బాస్’ ఫేమ్ మానస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. ఒక వైపు బిగ్ బాస్ లో తనదైన శైలిలో దూసుకుపోతు టాప్ 5 లో చోటు దక్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి ఇప్పుడు హీరోగా, విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. అతి త్వరలోనే బిగ్ బాస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దాంతో సహజంగానే అతను నటిస్తున్న, నటించబోతున్న సినిమాలకు కొంత క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతనితో ఓ సినిమా నిర్మించబోతున్నట్టు స్క్వేర్ ఇండియా స్టూడియోస్ అధినేత ప్రతాప్ కొలగట్ల తెలిపారు.

    Bigg Boss Manas

    Also Read: ఈ పోరాటం ఏదో స్టీల్ ప్లాంట్ కోసం చేయండి… షణ్ముఖ్ ఫ్యాన్స్ పై నెటిజన్స్ ఫైర్!

    గతంలో ‘3 జీ లవ్’ సినిమా నిర్మించిన ఆయన ఇప్పుడీ సినిమాకు ‘5 జీ లవ్’ అనే పేరు ఖరారు చేశారు. రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తున్న మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయకులు ఉంటారని, అందులో మానస్ ఒకరని, పలు హిట్ చిత్రాలకి సంగీతం అందించిన శేఖర్ చంద్ర తమ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారని ప్రతాప్ చెప్పారు. మరో వైపు మానస్ నాగులపల్లి నటించిన ‘క్షీరసాగర మథనం’ చిత్రం ఆగస్ట్ మొదటివారంలో విడుదలైంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. కాగా ఇటీవలే ఈ సినిమాను త్వరలో హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ చేయాలని అనుకుంటున్నామని దర్శకుడు అనిల్‌ పంగులూరి తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Also Read: బిగ్ బాస్ హౌస్ నుంచి కాజల్ ఎలిమినేట్ … అతను అన్నిట్లో డ్రామా చేస్తాడంటూ