Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్ లో తెరకెక్కిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఐదు భాషల్లో ఒకే సారి డిసెంబర్ 17న “పుష్ప ది రైజ్ ” పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది.

Also Read: పుష్ప ఫెస్టివల్‌కు అంతా సిద్ధం.. భారీ సంఖ్యలో థియేటర్లు లాక్
పుష్ప సినిమా హిందీ వెర్షన్ కు సెన్సార్ నిరాకరించింది. దీంతో ‘పుష్ప’సినిమాకు సెన్సార్ కష్టాలు మొదలయ్యాయి. ఊహకు మించి ‘పుష్ప’ కు క్రేజ్ వచ్చిన నేపథ్యంలో సెన్సార్ సమస్యలు తలెత్తడం ఫాన్స్, నిర్మాతలతో పాటు అందరిని షాక్ కు గురి చేస్తోంది. సెన్సార్ కోసం రాత్రింబవళ్ళు పని చేస్తుంది టెక్నికల్ టీమ్. ‘రా’ మెటీరియల్ తోనే తెలుగు సెన్సార్ పూర్తి చేశారు. కన్నడ వెర్షన్ సెన్సార్ కూడా రా మెటీరియల్ తోనే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే హిందీ వెర్షన్ కూడా పూర్తి అవుతుంది అనుకున్న తరుణంలో సెన్సార్ బోర్డు ఊహించని షాక్ ఇచ్చింది. పూర్తి స్థాయి ప్రింట్ తోనే సెన్సార్ చేస్తామని స్పష్టం చేసింది సెన్సార్ బోర్డు. మరి దీనిపై పుష్ప మూవీ యూనిట్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్, పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే కన్నడ నటుడు ధనుంజయ, సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read: ‘పుష్ప’ను వెంటాడుతున్న సెన్సార్ కష్టాలు.. అక్కడ ఈరోజే?