ICC Women’s T20 World Cup 2022: క్రికెట్ అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది ICC. త్వరలోనే మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుందని తెలిపింది. అందుకు సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. న్యూజిలాండ్ వేదికగా మార్చి 4న ఈ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమై ఏప్రిల్ 3వ తేదిన జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. తొలిమ్యాచ్ న్యూజిలాండ్ మరియు వెస్టిండీస్ మధ్య ఉండనున్నట్టు ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ పేర్కొంది. ఇదిలాఉండగా భారత మహిళల జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మార్చి 6వ తేదిన తలపడనుంది. ఆ తర్వాత మార్చి 10వ తేదిన న్యూజిలాండ్ జట్టుతో, మార్చి 12వ తేదిన వెస్టిండీస్ మరియు మార్చి 16న ఇంగ్లండ్ జట్టుతో, మార్చి 19తేదిన ఆస్ట్రేలియా జట్టుతో, మార్చి 22 తేదిన బంగ్లాదేశ్ జట్టుతో, మార్చి 27తేదిన దక్షిణాఫ్రికాతో జట్టుతో టీం ఇండియా మహిళల జట్టు తలపడనుంది.
ఈ టోర్నీలో ఎన్ని వేదికలంటే..?
టీ20 వరల్డ్ కప్ మహిళల టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు మిగిలిన జట్టుతో మ్యాచులు ఆడనుంది. ఇందుకోసం ఆక్లాండ్, క్రైస్ట్‌చర్చి, డ్యునెడిన్, తౌరంగా, హామిల్టన్, వెల్లింగ్టన్ వేదికలను సిద్ధం చేశారు. ఈ టోర్నీలో మొత్తంగా 31 మ్యాచులు జరగనున్నాయి. లీగ్ దశలో మొదటి నుంచి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు అనగా టాప్-4 టీమ్స్ మాత్రమే సెమీస్‌కు క్వాలిఫై అవుతాయి. ఇకపోతే లీగ్ మ్యాచుల అనంతరం తొలి సెమీ ఫైనల్ మార్చి 30వ తేదిన వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 31వ తేదిన క్రైస్ట్‌చర్చి వేదికగా ఐసీసీ ప్లాన్ చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3వ తేదిన క్రైస్ట్‌చర్చి వేదికగానే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ రోజును కేటాయించినట్టు ఐసీసీ ప్రకటించింది.
Also Read: Kohli and Sachin: అప్పుడు సచిన్‌కు.. ఇప్పుడు విరాట్‌కు.. సేమ్ సీన్..!
టీం ఇండియా కప్పు కొట్టేనా..?
ICC మహిళల చాంపియన్ షిప్ 2017-20 వరకు పరిగణలోకి తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఇక టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తు్న్న న్యూజిలాండ్ జట్టు కూడా నేరుగా అర్హత సాధించి ఈ జాబితాలో చేరింది. మిగిలిన మూడు జట్లు బంగ్లాదేశ్, వెస్టిండీస్, పాకిస్తాన్‌లు అర్హత కోసం క్వాలిఫైయర్ మ్యాచెస్ ఆడాల్సి ఉండగా కొవిడ్ నేపథ్యంలో ఈ మ్యాచులను రద్దు చేశారు. లాస్ట్ టైం ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను ఎగరేసుకుని పోయింది. ఈ సారి అయిన టీం ఇండియా సివంగులు మైదానంలో గర్జించి టైటిల్ సాధిస్తారో లేదో వేచిచూడాల్సిందే..
Also Read: Virat Kohli vs BCCI: టీమిండియాలో ముసలం.. కోహ్లీ వదులుకోలేదు.. తొలిగించారన్న మాట