Divi Vadthya: బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా అందరికీ సుపరిచితమే. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన దివి లవ్, ఎఫైర్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా కొన్ని సీక్రెట్ లవ్ టిప్స్ ఇచ్చింది. ప్రేమలో ఉన్న అబ్బాయిలు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలట. తన సలహాలు ఫాలో అయితే మీకే మంచిదని దివి చెప్పుకొచ్చింది. ఇంతకీ దివి చెప్పిన ఆ సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మగవారు ఫ్లర్ట్ చేయకుండా జెన్యూన్ గా ఉండాలట. అమ్మాయిలకు అన్ని తెలిసినా తెలియనట్లు నటిస్తారట. మీరు ఎంత రియాలిటీగా ఉంటారో .. మీ జీవితం అంత బాగుంటుందని, దివి అన్నారు. మీరు ఫ్లర్ట్ చేస్తే అమ్మాయిలు నిజం అనుకుని మీతో రిలేషన్ లోకి అడుగు పెడితే .. తర్వాత మీ రియాలిటీ చూసి వాళ్ళు సఫర్ అవుతారు. అబ్బాయిలే కాదు .. అమ్మాయిలు కూడా ఇలా చేయొచ్చు. ఎవరికోసం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని దివి హెచ్చరించింది.
మనం మనలా ఉండగలిగితినే రిలేషన్ షిప్ లోకి వెళ్ళాలి. ఎవరికోసం మారాల్సిన అవసరం లేదు అని తెలిపింది. ఇక బెస్టీ(స్నేహితుడు) గురించి చెప్తూ .. అమ్మాయిలకు బెస్టీలు అబ్బాయిలే అవుతారు. బాయ్స్ ఫ్రెండ్ షిప్ జెన్యూన్ గా ఉంటుంది. స్నేహం వేరు .. ప్రేమ వేరు. రెండిటిని ఒకేలా చూడకూడదు. ఇవి రెండు డిఫరెంట్ రిలేషన్స్. ఎవరికీ ఎంత ప్రయారిటీ ఇవ్వాలో మనకి తెలియాలి. మన పార్ట్నర్ కు, బెస్టీ కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అది తెలుసుకుని ప్రవర్తించాలి అని దివి చెప్పుకొచ్చింది. అదన్నమాట సంగతి.
ఇక దివి కెరీర్ పరిశీలిస్తే… హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చింది. స్మాల్ బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అవి విడుదలయ్యాయని కూడా ఎవరికీ తెలియదు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపేట్ చేసి గుర్తింపు రాబట్టింది. మహర్షి, గాడ్ ఫాదర్, జిన్నా, రుద్రంగి వంటి చిత్రాల్లో దివి నటించింది. ఇటీవల విడుదలైన లంబసింగి చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ నటిగా కొనసాగుతుంది.