Tata Altroz Racer: కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న కంపెనీల్లో టాటా మోటార్స్ ఒకటి. మారుతి కంపెనీకి ప్రత్యామ్నాం అని చెప్పుకుంటున్న ఈ కారు ఎస్ యూవీ కార్ల ఉత్పత్తిలో అగ్రశ్రేణిగా ఉంది. ఇదే సమయంలో హ్యాచ్ బ్యాక్ స్పోర్టీయర్ వెర్షన్ ఉత్పత్తిలో సక్సెస్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. 2023 ఆటో ఎక్స్ ఫోలో మొదటిసారిగా ప్రదర్శించిన ఇది ‘ఆల్ట్రోజ్ రేసర్’ పేరుతో త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..
టాటా ఆల్ట్రోజ్ రేసర్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పాటు 118 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 170 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేయనుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ మాత్రమే ఉండనుంది. ఫీచర్స్ విషయానికొస్తే ఎలక్ట్రిక్ సన్ రూప్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్ లెస్ చార్జింగ్, హెచ్ యూడీని కలిగి ఉంది. ఇందులో 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఆకట్టుకుంటుంది. రక్షణ కోసం 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ హెడ్ రెస్ట్ లపై రేసర్, వెనుక ఏసీ వెంట్ లు ఉన్నాయి. అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.
కొత్త టాటా చూడ్డానికి ఆకర్షనీయమైన లుక్ లో కనిపిస్తుంది. ఇది గూఢాచారి సినిమాల్లో ఉండే కార్ల మాదిరిగా స్టైలిష్ గా రూపొందించారు. పై కప్పు మినహా అన్ని విభాగాలకు తెల్లటి రక్షణ కవచం ఉంటుంది. ట్విన్ టిప్ ఎగ్జాస్ట్ సెటప్ ను కలిగి ఉన్న ఇందులో ప్రామాణిక ఆల్ట్రోజ్ నుంచి వేరు చేస్తుంది. ఇప్పటికే మార్కట్లో ఉన్న ఆల్ట్రోజ్ ను పూర్తిగా మార్చి వేసి ‘ఆల్ట్రోజ్ రేసర్’గా మార్చారు. రెడ్, బ్లాక్ కలర్ తో పాటు గోల్డ్ కలర్ లో అందుబాటులోకి రానుంది.
ఈ మోడల్ ధరపై ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. టాటా నుంచి ఇప్పటికే రిలీజై రోడ్లపై తిరుగుతున్న అల్ట్రోజ్ రూ. 6 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఇప్పుడు ఆల్ట్రోజ్ రేసర్ సరికొత్త రూపులో రానుంది. డిజైన్, ఫీచర్స్ తో ఆకట్టుకోనుది. ఈ నేపథ్యంలో దీనిని రూ.10 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయించనున్నారు.