Ashwini Sree: అశ్విని శ్రీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 ఫాలో అయిన వారికి ఈ అమ్మడు గురించి బాగా తెలిసే ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినా బిగ్ బాస్ తో ఫుల్ ఫేమస్ అయింది ఈ అమ్మడు. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసినా పెద్దగా రాని పేరు బిగ్ బాస్ ద్వారా వచ్చిందనే చెప్పాలి. ఈ సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.కానీ మొదటి రోజే అసహనం వ్యక్తం చేసింది. ఎవరు తనను పట్టించుకోవడం లేదని బాధ పడింది.
ఎవరు పట్టించుకోవడం లేదని ఎంతో ఆవేదన చెంది చాలా ఏడ్చింది కూడా ఈ అమ్మడు. ఇక భోలే షావలి, ప్రిన్స్ యావర్ మాత్రం ఈమెతో మంచి స్నేహం చేశారు. ఇక సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే అశ్విని బిగ్ బాస్ హౌజ్ లో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఇక మొత్తం మీద 12వ వారంలో ఎలిమినేట్ అయింది అశ్వినీ. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది. మరి ఆమె చేసిన కామెంట్లు ఓ సారి తెలుసుకుందామా?
మీకు ఎలాంటి భర్త కావాలి అంటే.. అందం, డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ మంచి వాడు మాత్రం కావాలి అని చెప్పుకొచ్చింది. అయితే తనకు కాబోయే భర్త మాత్రం ఇండస్ట్రీకి చెందిన వాడు వద్దు అని చెప్పింది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నవారు ఫుల్ బిజీగా ఉంటారని తనను పట్టించుకోరు అని అందుకే బయట వారు కావాలి అని చెప్పింది. కానీ తను మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతుందట. ప్రేమకు తాను వ్యతిరేకం కాదని.. ప్రేమ పేరుతో వాడుకునే వారు మాత్రం చాలా మంది ఉన్నారని వారికి తాను అందనని తెలిపింది.
తన లైఫ్ లో కరెక్ట్ పర్సన్ దొరికితే తప్ప పెళ్లి చేసుకోను అని తెలిపింది. అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను అని త్వరగా రా బాబు అంటూ ఆహ్వానం పలికింది. తనను చూడటానికి రెడీగా ఉన్నాను అంటూ తెలిపింది. తను లేక నిద్ర పట్టడం లేదని, అశ్విని లాగే తను కూడా క్రేజీ గా ఉండాలని బెడ్ మీద తను తోడుగా ఉంటే గానీ నిద్ర పట్టదు అని పేర్కింది. తను డ్రీం బాయ్ అంటూ ఆయన లేకుండా ఉదయం 4గ.లు అవుతున్నా నిద్ర పట్టడం లేదని తెలిపింది. తను ఉంటే హగ్ చేసుకొని పడుకుంటానని.. తన కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పేసరికి అశ్విని మాటలకు అందరూ షాక్ అవుతున్నారు. మరి ఈమెకు వచ్చే భర్త ఎలా ఉంటారో చూడాలి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Bigg boss ashwini sree comments about future husband
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com