Bharateeyudu 2 Pre Release Event: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే సినిమా ఇండస్ట్రీలో తమ నటనతో కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోతారు. ఇక అలాంటి నటులలో కమలహాసన్ ఒకరు. ఆయన చేసిన సినిమాల గురించి మనం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ నెల 12వ తేదీన ఆయన హీరోగా చేసిన ‘భారతీయుడు 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక దానికోసం ఈరోజు హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఇక అందులో భాగంగానే బ్రహ్మానందం కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సినిమా గురించి ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. కానీ కమలహాసన్ ను ఉద్దేశించి చాలా మంచి మాటలు మాట్లాడారు. అవి ఏంటి అంటే కమలహాసన్ గారి ఏజ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. కానీ నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాను. నటన అనేది ఆయన నవ నాడుల్లో ఉంది. ఆయన బాడీలో ఏ పార్ట్ అయిన సరే ఎంతవరకు నటించాలో అంతవరకు మాత్రమే నటిస్తుంది. తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు, ఇండియా లోనే కాదు, టోటల్ ప్రపంచంలోనే కమలహాసన్ ను మించిన నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదంటూ బ్రహ్మానందం కమలహాసన్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
ఇక ఆయన ఉన్న కాలంలో మనం సినిమా ఇండస్ట్రీలో ఉండడం, ఆయనతోపాటు సినిమాలో చేయడం నిజంగా నా అదృష్టం అంటూ ఆయన కమలహాసన్ గురించి చెప్పిన మాటలు ఈ జనరేషన్ లో ఉన్న చాలా మందికి కమల్ హాసన్ గొప్పతనాన్ని తెలిసేలా చేశాయి. ఇక అందులో భాగంగానే కమలహాసన్ ని ఇమిటేట్ కూడా చేశాడు. ముఖ్యంగా కమలహాసన్ లా మిమిక్రీ చేసి అందర్నీ ఇంప్రెస్ చేశాడు. నిజానికి బ్రహ్మానందం చేసిన మిమిక్రీ నార్మల్ గా లేదు.
మనం కళ్ళు మూసుకొని ఆ స్పీచ్ కనక వింటే పక్కాగా కమలహాసన్ గారే మాట్లాడారు అనేంతలా ఆయన వాయిస్ ను మ్యాచ్ చేస్తూ మాట్లాడాడు. నిజంగా ఈ విషయంలో బ్రహ్మానందం ను కూడా చాలా వరకు మెచ్చుకోవచ్చు. ఆయన ఎన్నో సినిమాలను చేసి, చాలా అవార్డులను అందుకున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కమల్ హాసన్ గురించి మాట్లాడటం అనేది నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More