https://oktelugu.com/

Anasuya Bharadwaj: అలాంటి బట్టలు వేసుకుంటే మానభంగం చేస్తారా… సంచలనంగా యాంకర్ అనసూయ పోస్ట్!

అనసూయ అభిమాని ఒకరు ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అమ్మాయిలు స్కర్ట్ వేసినా .. జీన్స్ వేసినా .. సంప్రదాయ దుస్తులు ధరించినా .. ఇంటి నుంచి బయటకు వెళ్లినా .. ఇంట్లో ఉన్నా ఎవరొకరి చేత మానభంగానికి గురవుతున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : April 26, 2024 / 06:21 PM IST

    Anasuya Bharadwaj

    Follow us on

    Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తుంది. తాజాగా అనసూయ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఆడవారి వేషధారణ, వారు ధరించే దుస్తుల వల్లనే మానభంగాలు జరుగుతున్నాయి అనే వాదనకు వ్యతిరేకంగా తన అభిమాని పెట్టిన పోస్ట్ పై ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.

    అనసూయ అభిమాని ఒకరు ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అమ్మాయిలు స్కర్ట్ వేసినా .. జీన్స్ వేసినా .. సంప్రదాయ దుస్తులు ధరించినా .. ఇంటి నుంచి బయటకు వెళ్లినా .. ఇంట్లో ఉన్నా ఎవరొకరి చేత మానభంగానికి గురవుతున్నారు. అమ్మాయిలు ధరించే దుస్తుల వల్ల కాదు .. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. అప్పుడే మహిళలపై అఘాయిత్యాలు, రేప్ లు ఆగుతాయి అని పోస్ట్ పెట్టారు.

    సదరు పోస్ట్ చూసి అనసూయ స్పందిస్తూ .. నేను నా వాళ్ళు అనుకునే వాళ్ళు వీళ్ళు. నన్ను అభిమానించే వారు కొందరి ఫ్యాన్ పేజీల మాదిరిగా ఎవరిని దూషించరు. ఎవరిని టార్గెట్ చేసి రెచ్చగొట్టరు. ఎవరిని ట్రోల్ చేసి ఇబ్బందులకు గురి చేయరు. అనవసరంగా ఎవరినీ అగౌరవ పరచరు. వీళ్ళు వాళ్ళ బాధ్యత నుంచి పారిపోరు. మంచి మనసుతో ఉండే వారిని చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఇక కొందరు ఫ్యాన్ పేజీలు మెయింటైన్ చేసేవారు గుమ్మడి కాయల దొంగలు. అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు.

    జంతువుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనిని కూడా ట్రోల్ చేస్తారని తెలుసు. అయినా నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మంచి మనుషులు. వారిని నేను ఎల్లప్పుడు ప్రేమిస్తాను అని అనసూయ పోస్ట్ రాసుకొచ్చారు. అనసూయ ఆమె ధరించే దుస్తులు నిత్యం ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది. కొందరు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూసి తన క్యారెక్టర్ పై దారుణంగా విమర్శలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి అనసూయ ఘాటుగానే కౌంటర్ ఇస్తూ ఉంటుంది.